Maayadaarisemta limkaa maanavayyaa

మాయదారిచేఁత లింకా మానవయ్యా
Language

(॥పల్లవి॥)
మాయదారిచేఁత లింకా మానవయ్యా
ఆయము మోచినదే ఆనతియ్యవయ్యా

(॥మాయ॥)
సిగ్గులు నీమీఁద వేసి చింతఁ బొరలీ చెలి
యెగ్గుదీర మాఁటుమందు యేదయ్యా
నిగ్గుదేరి విరహము నీకుఁగానె యింతసేసె
దగ్గరి యింతిఁ గావఁగ తతి యేదయ్యా

(॥మాయ॥)
పాయము నీ కొప్పగించి పవ్వళించినది చెలి
చాయల మేలుకొలుప సందేదయ్యా
మోయఁగలనింద లెల్లా మోఁచెను నీమీఁదకె
యీయింతిమీఁదికరుణ కాఁక వేళేదయ్యా

(॥మాయ॥)
గక్కన నిన్నుఁ జూచి కాఁచి కాఁగిలించుకొనెఁ జెలి
మక్కువ నీకిఁక మీఁదిమాట యేదయ్యా
తక్కక శ్రీవేంకటేశ తతి నింతిఁ గూడితివి
మొక్కినమీలోలోనిముచ్చట లేవయ్యా

(||pallavi||)
māyadārisem̐ta liṁkā mānavayyā
āyamu mosinade ānadiyyavayyā

(||māya||)
siggulu nīmīm̐da vesi siṁtam̐ bŏralī sĕli
yĕggudīra mām̐ṭumaṁdu yedayyā
nigguderi virahamu nīgum̐gānĕ yiṁtasesĕ
daggari yiṁtim̐ gāvam̐ga tadi yedayyā

(||māya||)
pāyamu nī kŏppagiṁchi pavvaḽiṁchinadi sĕli
sāyala melugŏluba saṁdedayyā
moyam̐galaniṁda lĕllā mom̐sĕnu nīmīm̐dagĕ
yīyiṁtimīm̐digaruṇa kām̐ka veḽedayyā

(||māya||)
gakkana ninnum̐ jūsi kām̐si kām̐giliṁchugŏnĕm̐ jĕli
makkuva nīgim̐ka mīm̐dimāḍa yedayyā
takkaga śhrīveṁkaḍeśha tadi niṁtim̐ gūḍidivi
mŏkkinamīlolonimuchchaḍa levayyā