Maaya kide sahajamu maayanu geluvaraadu

మాయ కిదె సహజము మాయను గెలువరాదు
Language

(॥పల్లవి॥)
మాయ కిదె సహజము మాయను గెలువరాదు
మాయానాథుఁ గొలిచితే మన్నించు నాతఁడే

(॥మాయ॥)
చేతికి లోనైనట్టుండు సృష్టిలోని వేడుకలు
పోతరించి పట్టఁబోతేఁ బోవు నట్టటే
ఆతుమలో వేసరి అలసి వూరకుండితే
వైతాళపు నీడవలె వచ్చు వెంటవెంటను

(॥మాయ॥)
తీపువలెనే వుండు దిష్టపుఁ బదార్థాలు
మేపుగొంటే మీసాలమీఁది తేనౌను
యేపున నాస విడిచి యేరుపడి వుంటేను
మూపునఁ గట్టిన చద్దై మోఁపించును

(॥మాయ॥)
తలఁపులోనే వుండు తనలోని యంతరాత్మ
తెలుపుకోఁబోతే పెక్కుదేవతలౌను
చలపట్టి యీతనినే శరణని కొలిచితే
యెలమి శ్రీవేంకటేశుఁ డీతఁడై రక్షించును

(||pallavi||)
māya kidĕ sahajamu māyanu gĕluvarādu
māyānāthum̐ gŏliside manniṁchu nādam̐ḍe

(||māya||)
sedigi lonainaṭṭuṁḍu sṛṣhṭiloni veḍugalu
podariṁchi paṭṭam̐bodem̐ bovu naṭṭaḍe
ādumalo vesari alasi vūraguṁḍide
vaidāḽabu nīḍavalĕ vachchu vĕṁṭavĕṁṭanu

(||māya||)
tībuvalĕne vuṁḍu diṣhṭabum̐ badārdhālu
mebugŏṁṭe mīsālamīm̐di tenaunu
yebuna nāsa viḍisi yerubaḍi vuṁṭenu
mūbunam̐ gaṭṭina saddai mom̐piṁchunu

(||māya||)
talam̐pulone vuṁḍu tanaloni yaṁtarātma
tĕlubugom̐bode pĕkkudevadalaunu
salabaṭṭi yīdanine śharaṇani kŏliside
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍai rakṣhiṁchunu