Maavamtivaarigellaa maadala lonayyevaa

మావంటివారికెల్లా మాటల లోనయ్యేవా
Language

(॥పల్లవి॥)
మావంటివారికెల్లా మాటల లోనయ్యేవా
లావరులకైతేఁగాక లాలనకు మెత్తువా

(॥మావం॥)
చలమరులైనట్టి సతులకుఁగాని మరి
బలిమిగలపతులు పంపుసేయరు
తెలివితోఁ గొంగువట్టితీసేవారికిఁగాని
కెలయుచు నెఁతైనా కిందుపడరు

(॥మావం॥)
ముంగోపులై నట్టి ముదితలనే కాని
కందు దీరి యెందుకునుఁ గై కొనరు
వంగక తిట్టేమెరవడికతైలకుఁగాని
ముంగిటఁ గాచుకుండి మోహించరు

(॥మావం॥)
యెడయక కాచుకుండేఇంతులకేకాని
బడిబడిఁ గాచుకుండి పనికిరాదు
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
తడవకుండిన మీరు తమకించరు

(||pallavi||)
māvaṁṭivārigĕllā māḍala lonayyevā
lāvarulagaidem̐gāga lālanagu mĕttuvā

(||māvaṁ||)
salamarulainaṭṭi sadulagum̐gāni mari
balimigalabadulu paṁpuseyaru
tĕlividom̐ gŏṁguvaṭṭidīsevārigim̐gāni
kĕlayusu nĕm̐tainā kiṁdubaḍaru

(||māvaṁ||)
muṁgobulai naṭṭi mudidalane kāni
kaṁdu dīri yĕṁdugunum̐ gai kŏnaru
vaṁgaga tiṭṭemĕravaḍigadailagum̐gāni
muṁgiḍam̐ gāsuguṁḍi mohiṁcharu

(||māvaṁ||)
yĕḍayaga kāsuguṁḍeiṁtulagegāni
baḍibaḍim̐ gāsuguṁḍi panigirādu
aḍari śhrīveṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
taḍavaguṁḍina mīru tamagiṁcharu