మావంటివా రేమన్నా మర్మాలు సోఁకి వచ్చు
(॥పల్లవి॥)
మావంటివా రేమన్నా మర్మాలు సోఁకి వచ్చు
వేవేలు మీలో మీరు విచారించుకోరయ్యా
(॥వవం॥)
మచ్చికతోడుత నీవు మాటలాడఁగాఁ జూచి
నచ్చుకొని కొంతగొంత నవ్వీనాపె
హెచ్చుకుందు లందులోన నేమి దెలిసెనో కాని
విచ్చనవిడిని నీవే విచారించుకోవయ్యా
(॥వవం॥)
గుట్టుతోడ నీవు పెద్దకొలువై వుండఁగఁజూచి
నట్టినడుమ నిలిచి నవ్వీ నాపె
ఇట్టె చేసిన చేఁతలేమేమున్నవో కాని
దట్టముగ మనసులోఁ దలపోసుకోవయ్యా
(॥వవం॥)
శ్రీవేంకటేశుఁడ నన్నుఁ జెందినట్టి నిన్నుఁజూచి
నావెనక నిదివో నవ్వీ నాపె
యేవల నీకు వలపు లెన్నిగలవో కాని
ఆవటించి చెలులతో నాలోచించుకోవయ్యా
(||pallavi||)
māvaṁṭivā remannā marmālu som̐ki vachchu
vevelu mīlo mīru visāriṁchugorayyā
(||vavaṁ||)
machchigadoḍuda nīvu māḍalāḍam̐gām̐ jūsi
nachchugŏni kŏṁtagŏṁta navvīnābĕ
hĕchchuguṁdu laṁdulona nemi dĕlisĕno kāni
vichchanaviḍini nīve visāriṁchugovayyā
(||vavaṁ||)
guṭṭudoḍa nīvu pĕddagŏluvai vuṁḍam̐gam̐jūsi
naṭṭinaḍuma nilisi navvī nābĕ
iṭṭĕ sesina sem̐talememunnavo kāni
daṭṭamuga manasulom̐ dalabosugovayyā
(||vavaṁ||)
śhrīveṁkaḍeśhum̐ḍa nannum̐ jĕṁdinaṭṭi ninnum̐jūsi
nāvĕnaga nidivo navvī nābĕ
yevala nīgu valabu lĕnnigalavo kāni
āvaḍiṁchi sĕlulado nālosiṁchugovayyā