Maavalla mamchidanaalu mari soodamgalavaa

మావల్ల మంచితనాలు మరి చూడఁగలవా
Language

(॥పల్లవి॥)
మావల్ల మంచితనాలు మరి చూడఁగలవా
నీవే నన్నుఁ దగులఁగా నేఁ డనేఁ గాక

(॥మావల్ల॥)
మచ్చరమె కూడైన మానినుల మింతే
యిచ్చకము నేరిచేమా యెన్నటికైనా
ముచ్చటతో నీవే మమ్ము ముందు ముందే బుజ్జగించి
హెచ్చుసేసి మన్నించఁగా నెనసితిఁ గాక

(॥మావల్ల॥)
చంచలపుఁ జూపుల జవ్వనుల మింతే
ఇంచుకంత తాలిమి నేఁడింక వచ్చీనా
వంచనతో నీవే మమ్ము వాడుదేర నాదరించి
మించఁ జేయఁగా నేఁడు మెరసితిఁ గాక

(॥మావల్ల॥)
రతికి వేగిరపడే రమణులమింతే నీ-
ఇతవు దెలియుదాఁకా నెడశుండీనా
పతివి శ్రీవేంకటేశ పై పై నన్నుఁ గూడితివి
మతి నీ వియ్యఁగానే మరిగితిఁ గాక

(||pallavi||)
māvalla maṁchidanālu mari sūḍam̐galavā
nīve nannum̐ dagulam̐gā nem̐ ḍanem̐ gāga

(||māvalla||)
machcharamĕ kūḍaina māninula miṁte
yichchagamu nerisemā yĕnnaḍigainā
muchchaḍado nīve mammu muṁdu muṁde bujjagiṁchi
hĕchchusesi manniṁcham̐gā nĕnasidim̐ gāga

(||māvalla||)
saṁchalabum̐ jūbula javvanula miṁte
iṁchugaṁta tālimi nem̐ḍiṁka vachchīnā
vaṁchanado nīve mammu vāḍudera nādariṁchi
miṁcham̐ jeyam̐gā nem̐ḍu mĕrasidim̐ gāga

(||māvalla||)
radigi vegirabaḍe ramaṇulamiṁte nī-
idavu dĕliyudām̐kā nĕḍaśhuṁḍīnā
padivi śhrīveṁkaḍeśha pai pai nannum̐ gūḍidivi
madi nī viyyam̐gāne marigidim̐ gāga