Maavale numdavaladaa manasu manasum bomdi

మావలె నుండవలదా మనసు మనసుఁ బొంది
Language

(॥పల్లవి॥)
మావలె నుండవలదా మనసు మనసుఁ బొంది
కైవశ మాతఁడు నాకుఁ గలకాలమెల్లను

(॥మావ॥)
చనవరినందువు జాణ ననుకొందువు
యెనలేనిరమణుని నేల దూరేవే
పెనఁగి పెద్దరికాలు పెంచేది యెఱఁగము
ఘనమై మీగుట్టు నేఁడు కానవచ్చె మాకు

(॥మావ॥)
నీవే మించితి నందువు నేరుపరినందువు
యీవల నాతని కెంత యేఁకారేవే
భావించి వేసాలు నీవు పచరించే దెఱఁగము
కావిరి వలపు తారుకాణాయ మాకు

(॥మావ॥)
యెమ్మె చెల్లునందువు యెనసితి నందువు
చిమ్మి శ్రీవేంకటేశుపై చేఇ వేసేవేమె
నెమ్మినాతఁడె నన్నేలె నీమనసు యెఱఁగము
తెమ(మ్మ?)లైన సంతోసము దిష్టమాయ మాకు

(||pallavi||)
māvalĕ nuṁḍavaladā manasu manasum̐ bŏṁdi
kaivaśha mādam̐ḍu nāgum̐ galagālamĕllanu

(||māva||)
sanavarinaṁduvu jāṇa nanugŏṁduvu
yĕnaleniramaṇuni nela dūreve
pĕnam̐gi pĕddarigālu pĕṁchedi yĕṟam̐gamu
ghanamai mīguṭṭu nem̐ḍu kānavachchĕ māgu

(||māva||)
nīve miṁchidi naṁduvu nerubarinaṁduvu
yīvala nādani kĕṁta yem̐kāreve
bhāviṁchi vesālu nīvu pasariṁche dĕṟam̐gamu
kāviri valabu tārugāṇāya māgu

(||māva||)
yĕmmĕ sĕllunaṁduvu yĕnasidi naṁduvu
simmi śhrīveṁkaḍeśhubai sei vesevemĕ
nĕmminādam̐ḍĕ nannelĕ nīmanasu yĕṟam̐gamu
tĕma(mma?)laina saṁtosamu diṣhṭamāya māgu