మావలె నోర్వదు మంకు యీ వనిత
(॥పల్లవి॥)
మావలె నోర్వదు మంకు యీ వనిత
కైవసమై పొదుగఁగవలెఁ జుమ్మీ
(॥వవలె॥)
సుదతి యాసతోఁ జోటడిగీ నదె
యెదురెదురనె యెడమియ్యవయ్యా
సదరుచు నెగ్గులు వట్టిన యాపెకు
కదిసి నీవు మొక్కఁగవలెఁ జుమ్మీ
(॥వవలె॥)
కలికి పచ్చడము గప్పుమనీ నదె
విలసిల్ల ముసుఁగు వేయవయ్యా
నెలఁత నిన్నుఁ గడు నేరములెంచిన
నలువున వేఁడుకొనఁగవలెఁ జుమ్మీ
(॥వవలె॥)
నాతి యేకతమునకు లాసీ నదె
ఆ తెర దిగవేయఁగదయ్యా
యేతున శ్రీవేంకటేశ మమ్మేలితి
వీతతిఁ బంతములివలెఁ జుమ్మీ
(||pallavi||)
māvalĕ norvadu maṁku yī vanida
kaivasamai pŏdugam̐gavalĕm̐ jummī
(||vavalĕ||)
sudadi yāsadom̐ joḍaḍigī nadĕ
yĕdurĕduranĕ yĕḍamiyyavayyā
sadarusu nĕggulu vaṭṭina yābĕgu
kadisi nīvu mŏkkam̐gavalĕm̐ jummī
(||vavalĕ||)
kaligi pachchaḍamu gappumanī nadĕ
vilasilla musum̐gu veyavayyā
nĕlam̐ta ninnum̐ gaḍu neramulĕṁchina
naluvuna vem̐ḍugŏnam̐gavalĕm̐ jummī
(||vavalĕ||)
nādi yegadamunagu lāsī nadĕ
ā tĕra digaveyam̐gadayyā
yeduna śhrīveṁkaḍeśha mammelidi
vīdadim̐ baṁtamulivalĕm̐ jummī