Maasadeelaa meeredainaa magidi magidi nemdu

మాసటీలా మీరేదైనా మగిడి మగిడి నేఁడు
Language

(॥పల్లవి॥)
మాసటీలా మీరేదైనా మగిడి మగిడి నేఁడు
గోస నాసచేసి యేల కొంచేవు నీవు

(॥మాస॥)
వేడుకకు నాకె నీపై వెసఁ జాఁచె నింతె చేయి
పాడిపంతా లిందుకేల పచారించేవు
ప్రోడగన యాపె నిన్ను బొమ్మల జంకించితేను
వోడక ఇందుకునేల వొరసేవు నీవు

(॥మాస॥)
తమకాన నొకమరి తడవె నింతె మాట
సముకాన సారె నేల సాదించేవు
అమరుఁ గనక ఇంతి ఆయములు ముట్టితేను
ప్రమదాన నింతేసి పరచేవు నీవు

(॥మాస॥)
తరుణి అడియాసల తప్పక చూచె నింతె
గరిమ నప్పటి నేల కాఁతాళించేవు
ఇరవై శ్రీవేంకటేశ యేలితి వాకె మొక్కితే
బెరసి యప్పటి నెంత పెనఁగేవు నీవు

(||pallavi||)
māsaḍīlā mīredainā magiḍi magiḍi nem̐ḍu
gosa nāsasesi yela kŏṁchevu nīvu

(||māsa||)
veḍugagu nāgĕ nībai vĕsam̐ jām̐sĕ niṁtĕ seyi
pāḍibaṁtā liṁdugela pasāriṁchevu
proḍagana yābĕ ninnu bŏmmala jaṁkiṁchidenu
voḍaga iṁdugunela vŏrasevu nīvu

(||māsa||)
tamagāna nŏgamari taḍavĕ niṁtĕ māḍa
samugāna sārĕ nela sādiṁchevu
amarum̐ ganaga iṁti āyamulu muṭṭidenu
pramadāna niṁtesi parasevu nīvu

(||māsa||)
taruṇi aḍiyāsala tappaga sūsĕ niṁtĕ
garima nappaḍi nela kām̐tāḽiṁchevu
iravai śhrīveṁkaḍeśha yelidi vāgĕ mŏkkide
bĕrasi yappaḍi nĕṁta pĕnam̐gevu nīvu