మారుమాట లాడరాదు మరి నేరా లెంచరాదు
(॥పల్లవి॥)
మారుమాట లాడరాదు మరి నేరా లెంచరాదు
సారెకు నిదివో నీ సంగాతాలు
(॥॥)
ఇచ్చకము లాడవలె ఇయ్యకొని యుండవలె
నిచ్చలు నేపోద్దు నాకు నీతో బదుకు
పచ్చి దేర నవ్వవలెఁ బనులన్నీఁ జేయవలె
గచ్చులను నీతోడికాఁపిరము నాకు
(॥॥)
తప్పక చూడఁగవలె తమకము చూపవలె
నెప్పున నెప్పుడు నాకు నీపొందులు
ముప్పిరిఁ బొగడవలె మోహము చెప్పఁగవలె
కుప్పలుగ నీతోడిమక్కువ నేస్తాలు
(॥॥)
కలసి వుండఁగవలె కాఁగిట బిగించవలె
తోలఁగరా దెంతైనా నీతో చెలిమి
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
అలమేల్మంగనే నేను అదె నీనాకూటమి
(||pallavi||)
mārumāḍa lāḍarādu mari nerā lĕṁcharādu
sārĕgu nidivo nī saṁgādālu
(||||)
ichchagamu lāḍavalĕ iyyagŏni yuṁḍavalĕ
nichchalu neboddu nāgu nīdo badugu
pachchi dera navvavalĕm̐ banulannīm̐ jeyavalĕ
gachchulanu nīdoḍigām̐piramu nāgu
(||||)
tappaga sūḍam̐gavalĕ tamagamu sūbavalĕ
nĕppuna nĕppuḍu nāgu nībŏṁdulu
muppirim̐ bŏgaḍavalĕ mohamu sĕppam̐gavalĕ
kuppaluga nīdoḍimakkuva nestālu
(||||)
kalasi vuṁḍam̐gavalĕ kām̐giḍa bigiṁchavalĕ
tolam̐garā dĕṁtainā nīdo sĕlimi
yĕlami śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
alamelmaṁgane nenu adĕ nīnāgūḍami