మారుకు మారు సేసితే మరికొంత యెక్కుడాయ
(॥పల్లవి॥)
మారుకు మారు సేసితే మరికొంత యెక్కుడాయ
యీరు దియ్యఁ బేను వచ్చె నిఁకనేలే చింత
(॥మారు॥)
చనవున జవరాలు చల్లె నీపై వసంతము
కొనచూపుల నింతేల కొచ్చి చూచేవు
వొనర నందుకు నీవు వోరుచుకో వైతివి
పెనఁగులాడఁగఁబోతే పిప్పిగట్టె మోవి
(॥మారు॥)
మన్నింతువంటా నాకెమాఁట నిన్ను సోఁక నాడె
సన్నలనే యింత యాల జంకించేవు
చెన్నుమీర నది నవ్వుసేసుకోవైతివి
కన్నెచన్ను లంటఁబోతే కాయగాచె నురము
(॥మారు॥)
ననువున లలితాంగి నాఁటఁగఁ జన్నుల నొత్తే
పనివడి సారె నేల పంత మాడేవు
యెనసితివి శ్రీవేంకటేశ నీ వందుకుఁ గాను
చెనఁకఁగఁ బోతేను చెమరించె మేను
(||pallavi||)
mārugu māru seside marigŏṁta yĕkkuḍāya
yīru diyyam̐ benu vachchĕ nim̐kanele siṁta
(||māru||)
sanavuna javarālu sallĕ nībai vasaṁtamu
kŏnasūbula niṁtela kŏchchi sūsevu
vŏnara naṁdugu nīvu vorusugo vaidivi
pĕnam̐gulāḍam̐gam̐bode pippigaṭṭĕ movi
(||māru||)
manniṁtuvaṁṭā nāgĕmām̐ṭa ninnu som̐ka nāḍĕ
sannalane yiṁta yāla jaṁkiṁchevu
sĕnnumīra nadi navvusesugovaidivi
kannĕsannu laṁṭam̐bode kāyagāsĕ nuramu
(||māru||)
nanuvuna lalidāṁgi nām̐ṭam̐gam̐ jannula nŏtte
panivaḍi sārĕ nela paṁta māḍevu
yĕnasidivi śhrīveṁkaḍeśha nī vaṁdugum̐ gānu
sĕnam̐kam̐gam̐ bodenu sĕmariṁchĕ menu