Maarugu maaru neevoo maguvanum jeyaraadaa

మారుకు మారు నీవూ మగువనుఁ జేయరాదా
Language

(॥పల్లవి॥)
మారుకు మారు నీవూ మగువనుఁ జేయరాదా
దూరలేల కట్టేవు తొయ్యలిపై నీవు

(॥మారు॥)
తప్పక చూచెనంటా తమకము రేఁచెనంటా
వుప్పతించి యాపె నేల వొడివట్టేవు
కప్పురాన వేసెనంటా కడు వలపించెనంటా
తప్పులేల మోపేవు తరుణిపై నీవు

(॥మారు॥)
చన్నులు దాఁకించెనంటా చవులు మురిపెనంటా
మిన్నక తిట్టుతా నేల మేల మాడేవు
సన్నలు సేసెనంటా చాలా నెలయించెనంటా
యెన్ని గొడిమెలు గట్టే వింతిమీఁద నీవు

(॥మారు॥)
మాఁటలఁ గొసరెనంటా మనసు గరఁచెనంటా
పాటించి యెంతేసి నెపాలు వేసేవు
గాఁటపు శ్రీవేంకటేశ కాఁగిట మెప్పించెనంటా
యేఁటలేల వేసేవు యీ సతిపై నీవు

(||pallavi||)
mārugu māru nīvū maguvanum̐ jeyarādā
dūralela kaṭṭevu tŏyyalibai nīvu

(||māru||)
tappaga sūsĕnaṁṭā tamagamu rem̐sĕnaṁṭā
vuppadiṁchi yābĕ nela vŏḍivaṭṭevu
kappurāna vesĕnaṁṭā kaḍu valabiṁchĕnaṁṭā
tappulela mobevu taruṇibai nīvu

(||māru||)
sannulu dām̐kiṁchĕnaṁṭā savulu muribĕnaṁṭā
minnaga tiṭṭudā nela mela māḍevu
sannalu sesĕnaṁṭā sālā nĕlayiṁchĕnaṁṭā
yĕnni gŏḍimĕlu gaṭṭe viṁtimīm̐da nīvu

(||māru||)
mām̐ṭalam̐ gŏsarĕnaṁṭā manasu garam̐sĕnaṁṭā
pāḍiṁchi yĕṁtesi nĕbālu vesevu
gām̐ṭabu śhrīveṁkaḍeśha kām̐giḍa mĕppiṁchĕnaṁṭā
yem̐ṭalela vesevu yī sadibai nīvu