Maarugonedaananaa machcharimchi needonu

మారుకొనేదాననా మచ్చరించి నీతోను
Language

(॥పల్లవి॥)
మారుకొనేదాననా మచ్చరించి నీతోను
కోరికలే పచరించి కూడుకుందుఁ గాక

(॥మారు॥)
పంతమాడఁగలమా పలుమారు నీతోడ
చెంతఁబ్రియమాడేనోటిచెలులము
రంతుల నీ విఁక నెంత రాజసము చూపినాను
అంతయు నే నిచ్చగించి అలరుదుఁగాక

(॥మారు॥)
కొసరఁగఁగలమా కొంగువట్టేనీతోను
వెస నూడిగాలు సేసేవెలఁదులము
పసలుగా నీవెంత బలుములు చూపినాను
పొసగ నీకే లోనై పొందేదానఁగాక

(॥మారు॥)
సిగ్గువడఁగలమా చెనకేటినీతోను
వొగ్గి నీరతులకెల్ల వోపుదుఁగాక
కగ్గక శ్రీవేంకటేశ కడు మందెమేళమైన
నిగ్గుల నిన్నే పొగడి నిండుకుందుఁగాక

(||pallavi||)
mārugŏnedānanā machchariṁchi nīdonu
korigale pasariṁchi kūḍuguṁdum̐ gāga

(||māru||)
paṁtamāḍam̐galamā palumāru nīdoḍa
sĕṁtam̐briyamāḍenoḍisĕlulamu
raṁtula nī vim̐ka nĕṁta rājasamu sūbinānu
aṁtayu ne nichchagiṁchi alarudum̐gāga

(||māru||)
kŏsaram̐gam̐galamā kŏṁguvaṭṭenīdonu
vĕsa nūḍigālu sesevĕlam̐dulamu
pasalugā nīvĕṁta balumulu sūbinānu
pŏsaga nīge lonai pŏṁdedānam̐gāga

(||māru||)
sigguvaḍam̐galamā sĕnageḍinīdonu
vŏggi nīradulagĕlla vobudum̐gāga
kaggaga śhrīveṁkaḍeśha kaḍu maṁdĕmeḽamaina
niggula ninne pŏgaḍi niṁḍuguṁdum̐gāga