Maanumannaa maanamdu maamti maamtigi

మానుమన్నా మానఁడు మాఁటి మాఁటికి
Language

(॥పల్లవి॥)
మానుమన్నా మానఁడు మాఁటి మాఁటికి
పోనిమ్మని వూరకున్నాఁ బొడవెక్కీఁ గదవే

(॥మాను॥)
ఆడరాదు తనకెదురంటే ననీఁగాక
వాడు దేరినమోమేల వచ్చెఁ దనకు
వోడక యిందుకుఁదోడు వూరకుండనీఁడు నన్ను
యీడుగాని మాట దీసి యెచ్చరించీఁగదవే

(॥మాను॥)
తలవంచుకుండరాదు తనచేతిబాధ నేఁడు
చిలుకుగోళ్ల నెత్తీ సిగ్గువడఁడు
నిలువఁబెట్టుచు తననిజమే నెరపవచ్చీ
యెలమి నిందరు నవ్వే దెఱఁగఁడుగదవే

(॥మాను॥)
గుట్టుసేసుకుండ నీఁడు కుమ్మరించీ వలపులు
యెట్టివాఁడు యిందాఁకా నేడ నుండెనే
వొట్టుక శ్రీవేంకటాద్రి నుండి వచ్చి నన్నుఁ గూడె
పట్టిన చలముతోడఁ బంత మిచ్చీగదవే

(||pallavi||)
mānumannā mānam̐ḍu mām̐ṭi mām̐ṭigi
ponimmani vūragunnām̐ bŏḍavĕkkīm̐ gadave

(||mānu||)
āḍarādu tanagĕduraṁṭe nanīm̐gāga
vāḍu derinamomela vachchĕm̐ danagu
voḍaga yiṁdugum̐doḍu vūraguṁḍanīm̐ḍu nannu
yīḍugāni māḍa dīsi yĕchchariṁchīm̐gadave

(||mānu||)
talavaṁchuguṁḍarādu tanasedibādha nem̐ḍu
silugugoḽla nĕttī sigguvaḍam̐ḍu
niluvam̐bĕṭṭusu tananijame nĕrabavachchī
yĕlami niṁdaru navve dĕṟam̐gam̐ḍugadave

(||mānu||)
guṭṭusesuguṁḍa nīm̐ḍu kummariṁchī valabulu
yĕṭṭivām̐ḍu yiṁdām̐kā neḍa nuṁḍĕne
vŏṭṭuga śhrīveṁkaḍādri nuṁḍi vachchi nannum̐ gūḍĕ
paṭṭina salamudoḍam̐ baṁta michchīgadave