Maanumanave ittivi maayimtiki rammanave

మానుమనవే ఇట్టివి మాయింటి‌కి రమ్మనవే
Language

(॥పల్లవి॥)
మానుమనవే ఇట్టివి మాయింటి‌కి రమ్మనవే
తానే యెరుఁగు నీమాట తలఁచుకొమ్మనవే

(॥మాను॥)
సరవిదప్పినవేళ సతితో నవ్వేవాఁడు
వరుసెరఁగని యట్టివాఁడెపో కూళ
యెరపరికపు పొరుగింతితో నవ్వేవాఁడు
దొరయైనఁగాని వాఁడే దొడ్డైనకూళ

(॥మాను॥)
వలవనివనితలవాకిలి దొక్కేఁవాడు
వలరాచగురుడైన వాఁడెపొ కూళ
తలవంచిన సతిని తప్పకచూచేవాఁడు
తొలుత నన్నందుకంటె దొడ్డైనకూళ

(॥మాను॥)
చిత్త మెరఁగనియట్టి చెలి జేరి కూకులును
వత్తులునై విరిగినవాఁడెపొ కూళ
చిత్తగించి నన్నుఁగూడె శ్రీవేంకటేశుఁడే జాణ
తొత్తువంటి దాకెపో దొడ్డైనకూళ

(||pallavi||)
mānumanave iṭṭivi māyiṁṭi‌ki rammanave
tāne yĕrum̐gu nīmāḍa talam̐sugŏmmanave

(||mānu||)
saravidappinaveḽa sadido navvevām̐ḍu
varusĕram̐gani yaṭṭivām̐ḍĕbo kūḽa
yĕrabarigabu pŏrugiṁtido navvevām̐ḍu
dŏrayainam̐gāni vām̐ḍe dŏḍḍainagūḽa

(||mānu||)
valavanivanidalavāgili dŏkkem̐vāḍu
valarāsaguruḍaina vām̐ḍĕbŏ kūḽa
talavaṁchina sadini tappagasūsevām̐ḍu
tŏluda nannaṁdugaṁṭĕ dŏḍḍainagūḽa

(||mānu||)
sitta mĕram̐ganiyaṭṭi sĕli jeri kūgulunu
vattulunai viriginavām̐ḍĕbŏ kūḽa
sittagiṁchi nannum̐gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍe jāṇa
tŏttuvaṁṭi dāgĕbo dŏḍḍainagūḽa