Maanumamte meemaadalagu maanamboyeenaa

మానుమంటే మీమాటలకు మానఁబోయీనా
Language

(॥పల్లవి॥)
మానుమంటే మీమాటలకు మానఁబోయీనా
మోనాన నూరకుండరే ముద్దుగారీ వీఁడు

(॥మాను॥)
వేడుకపడి వీఁడు వెన్నలు దొంగిలనీరే
వాడలవాడల నట్టే వలవనీరే
కోడెకాఁడై తిరిగీని కొంగులు వట్టఁగనీరే
జాడలెఱిఁగినయట్టిసాదుఁగొయ్య వీఁడు

(॥మాను॥)
చనవు మెరసీనేమో చన్నులు ముట్టఁగనీరే
తనియఁడేమో కాఁగిటఁ దగులనీరే
చెనకీనేమో మీపై చేతులు చాఁచఁగనీరే
ననిచివుండరే మీరు నసగొంటు వీఁడు

(॥మాను॥)
ఆసపడీనేమో తేనె కధరము లంటనీరే
పాసివుండఁజాలఁడేమో పైకొననీరే
వేసరక మిమ్మేలె శ్రీవేంకటాద్రి కృష్ణుఁ డిదె
అసుద్దులెల్లా మెచ్చరే అగడీఁడు వీఁడు

(||pallavi||)
mānumaṁṭe mīmāḍalagu mānam̐boyīnā
monāna nūraguṁḍare muddugārī vīm̐ḍu

(||mānu||)
veḍugabaḍi vīm̐ḍu vĕnnalu dŏṁgilanīre
vāḍalavāḍala naṭṭe valavanīre
koḍĕgām̐ḍai tirigīni kŏṁgulu vaṭṭam̐ganīre
jāḍalĕṟim̐ginayaṭṭisādum̐gŏyya vīm̐ḍu

(||mānu||)
sanavu mĕrasīnemo sannulu muṭṭam̐ganīre
taniyam̐ḍemo kām̐giḍam̐ dagulanīre
sĕnagīnemo mībai sedulu sām̐sam̐ganīre
nanisivuṁḍare mīru nasagŏṁṭu vīm̐ḍu

(||mānu||)
āsabaḍīnemo tenĕ kadharamu laṁṭanīre
pāsivuṁḍam̐jālam̐ḍemo paigŏnanīre
vesaraga mimmelĕ śhrīveṁkaḍādri kṛṣhṇum̐ ḍidĕ
asuddulĕllā mĕchchare agaḍīm̐ḍu vīm̐ḍu