Maaninula meemdanela madamulu sallevu

మానినుల మీఁదనేల మదములు చల్లేవు
Language

(॥పల్లవి॥)
మానినుల మీఁదనేల మదములు చల్లేవు
ఆనుకొని జూజాలెల్లా నాడుదము రమ్మా

(॥మాని॥)
వలపులెల్లా రేఁచి వాడలసతులఁ జూపి
చలము వుట్టింతురా సతుల కింత
పొలసి పొద్దులు నీకుఁ బోకుంటేఁగనక నేఁడు
అలవోక చదురంగాలాడుదము రమ్మా

(॥మాని॥)
సరసములెల్లా నాడి సవతుల నెచ్చరించి
కరికరిసేతురా కాంతల నింత
వురుటున నీకింత వుబ్బసపోకుంటేను
అరుదుగాఁ బగడసాలాడుదము రమ్మా

(॥మాని॥)
కొల్లున నవ్వులు నవ్వి కొలువుసతులఁ గూర్చి
పల్లదాలాడుదురా పట్టపుదారి
యెల్లగా శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
అల్లాడ నెత్తము మన మాడుదము రమ్మా

(||pallavi||)
māninula mīm̐danela madamulu sallevu
ānugŏni jūjālĕllā nāḍudamu rammā

(||māni||)
valabulĕllā rem̐si vāḍalasadulam̐ jūbi
salamu vuṭṭiṁturā sadula kiṁta
pŏlasi pŏddulu nīgum̐ boguṁṭem̐ganaga nem̐ḍu
alavoga saduraṁgālāḍudamu rammā

(||māni||)
sarasamulĕllā nāḍi savadula nĕchchariṁchi
karigarisedurā kāṁtala niṁta
vuruḍuna nīgiṁta vubbasaboguṁṭenu
arudugām̐ bagaḍasālāḍudamu rammā

(||māni||)
kŏlluna navvulu navvi kŏluvusadulam̐ gūrsi
palladālāḍudurā paṭṭabudāri
yĕllagā śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
allāḍa nĕttamu mana māḍudamu rammā