Maanini joli maani nemdu vaani

మానిని జోలి మాని నేఁడు వాని
Language

(॥పల్లవి॥)
మానిని జోలి మాని నేఁడు వాని
బూని నీ విట్టే భోగించుమీ

(॥మానిని॥)
వెన్నెలా చూపు వేమారుఁ జల్లుచు
కన్నులా నిన్ను గమ్మర నవ్వీని
సన్నలాఁ దిట్ట సారెకు మొలక
చన్నులా నోత్తి జంకించుమీ

(॥మానిని॥)
నిండినా ప్రేమ నీమీఁద నెట్టిదో
అండనే కాని యవ్వలఁ బాయఁడు
పండిన వంట పాయపువిభుని
మెండునాఁ గూడి మెప్పించుమీ

(॥మానిని॥)
చిన్నెకా యిట్టె శ్రీవేంకటేశ్వరుఁ
డున్నకాంతల నొల్లఁడు వీఁడివో
నిన్నె కౌఁగిట నించెను నీలి
వన్నెకానిని వదలకుమీ

(||pallavi||)
mānini joli māni nem̐ḍu vāni
būni nī viṭṭe bhogiṁchumī

(||mānini||)
vĕnnĕlā sūbu vemārum̐ jallusu
kannulā ninnu gammara navvīni
sannalām̐ diṭṭa sārĕgu mŏlaga
sannulā notti jaṁkiṁchumī

(||mānini||)
niṁḍinā prema nīmīm̐da nĕṭṭido
aṁḍane kāni yavvalam̐ bāyam̐ḍu
paṁḍina vaṁṭa pāyabuvibhuni
mĕṁḍunām̐ gūḍi mĕppiṁchumī

(||mānini||)
sinnĕgā yiṭṭĕ śhrīveṁkaḍeśhvarum̐
ḍunnagāṁtala nŏllam̐ḍu vīm̐ḍivo
ninnĕ kaum̐giḍa niṁchĕnu nīli
vannĕgānini vadalagumī