మానితినే తనతోడి మచ్చరములు
(॥పల్లవి॥)
మానితినే తనతోడి మచ్చరములు
కానీవే ఇఁకనేమి కపటాలు బాసెనే
(॥మాని॥)
వెనకటివలెఁగాక విచ్చేసెఁ దా నీడకు
మనసొక్కటాయ వేరేమాఁటలేఁటికే
చనవిచ్చె నింతఁగాను చలమెల్లా విడిచెను
కనుపట్టెఁ దనచేఁత కాఁతాళించనేలే
(॥మాని॥)
పరులమాట వినక పైకొని నన్ను మన్నించె
మరిగితి నాలోని మంకు దీరెనే
సరసము లాడె నాతో సటలెల్లా విడిచెను
కెరలెను నామోహము కిసరు విడిచెనే
(॥మాని॥)
వూసివాసు లెంచక వొగి నన్ను వేఁడుకొనె
సేసలు పైఁ బెట్టితినే చెల్లెఁ బంతము
ఆసల శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
సేసిననాపుణ్య మంబెఁ జెలఁగితినె
(||pallavi||)
mānidine tanadoḍi machcharamulu
kānīve im̐kanemi kabaḍālu bāsĕne
(||māni||)
vĕnagaḍivalĕm̐gāga vichchesĕm̐ dā nīḍagu
manasŏkkaḍāya veremām̐ṭalem̐ṭige
sanavichchĕ niṁtam̐gānu salamĕllā viḍisĕnu
kanubaṭṭĕm̐ danasem̐ta kām̐tāḽiṁchanele
(||māni||)
parulamāḍa vinaga paigŏni nannu manniṁchĕ
marigidi nāloni maṁku dīrĕne
sarasamu lāḍĕ nādo saḍalĕllā viḍisĕnu
kĕralĕnu nāmohamu kisaru viḍisĕne
(||māni||)
vūsivāsu lĕṁchaga vŏgi nannu vem̐ḍugŏnĕ
sesalu paim̐ bĕṭṭidine sĕllĕm̐ baṁtamu
āsala śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
sesinanābuṇya maṁbĕm̐ jĕlam̐gidinĕ