మానిపండ్లు మఱి మానికిందనే వుండు
(॥పల్లవి॥)
మానిపండ్లు మఱి మానికిందనే వుండు
తానేమన్నా తనకే యనరే
(॥వని॥)
చిగురుల మాటల చిల్లులు వోయను
తగుఁ బెదవులపై తనకే అది
మగటిమి యింకా మాతో నేటిఁకి
జగడము లడిచీఁ జాలించు మనవే
(॥వని॥)
కారపుఁజూపుల కాలువలాయను
దారలచెమటలఁ దనమేన
పోరుచు మాతో బొంకఁగ నేటికి
దరులఁబడితిమి తొల తొలమనవే
(॥వని॥)
కొనగొనచేతులు గురులయి తగిలెను
తననాకాఁగిట తనఁదనకే
యెనసెను శ్రీవేంకటేశుఁడు నన్నిటు
మనికయి అలమేల్‌మంగ నేఁగదవే
(||pallavi||)
mānibaṁḍlu maṟi mānigiṁdane vuṁḍu
tānemannā tanage yanare
(||vani||)
sigurula māḍala sillulu voyanu
tagum̐ bĕdavulabai tanage adi
magaḍimi yiṁkā mādo neḍim̐ki
jagaḍamu laḍisīm̐ jāliṁchu manave
(||vani||)
kārabum̐jūbula kāluvalāyanu
dāralasĕmaḍalam̐ danamena
porusu mādo bŏṁkam̐ga neḍigi
darulam̐baḍidimi tŏla tŏlamanave
(||vani||)
kŏnagŏnasedulu gurulayi tagilĕnu
tananāgām̐giḍa tanam̐danage
yĕnasĕnu śhrīveṁkaḍeśhum̐ḍu nanniḍu
manigayi alamelmaṁga nem̐gadave