Maanem boraa maadala kimka nelaa

మానెఁ బోరా మాటల కిఁక నేలా
Language

(॥పల్లవి॥)
మానెఁ బోరా మాటల కిఁక నేలా - నీకు
దీన నెగ్గవుత తెలియుము గాకా

(॥మానెఁ॥)
సారె సారె సాదించ నేటికి రా, నీవు
గోర గీరినఁ గోపించఁ దగదా
నేర మేమైన నే నీకుఁ జేసితినా, నీవు
బీరమాడినఁ బెనఁగితిఁ గాకా

(॥మానెఁ॥)
చాలుఁ జాలు జంకించ నేఁటికిరా, నీవు
నాలినేసిన నవ్వఁగఁ దగదా
నీలవర్ణుఁడ నే నీకుఁ బగదాననా, నీ
పోలికెలు చూచి పొమ్మంటీఁ గాకా

(॥మానెఁ॥)
నీకు నీకే నిజబాస లేఁటికిరా, నీ
కాఁకమే నంటి కరుణించఁ దగదా
చేకొనరా రతి శ్రీవేంకటేశ్వరుఁడా, నీవు
జోక గూడఁగఁ జొక్కితిఁ గాకా

(||pallavi||)
mānĕm̐ borā māḍala kim̐ka nelā - nīgu
dīna nĕggavuda tĕliyumu gāgā

(||mānĕm̐||)
sārĕ sārĕ sādiṁcha neḍigi rā, nīvu
gora gīrinam̐ gobiṁcham̐ dagadā
nera memaina ne nīgum̐ jesidinā, nīvu
bīramāḍinam̐ bĕnam̐gidim̐ gāgā

(||mānĕm̐||)
sālum̐ jālu jaṁkiṁcha nem̐ṭigirā, nīvu
nālinesina navvam̐gam̐ dagadā
nīlavarṇum̐ḍa ne nīgum̐ bagadānanā, nī
poligĕlu sūsi pŏmmaṁṭīm̐ gāgā

(||mānĕm̐||)
nīgu nīge nijabāsa lem̐ṭigirā, nī
kām̐kame naṁṭi karuṇiṁcham̐ dagadā
segŏnarā radi śhrīveṁkaḍeśhvarum̐ḍā, nīvu
joga gūḍam̐gam̐ jŏkkidim̐ gāgā