Maanavugaa maadoda mamdemelaalu

మానవుగా మాతోడ మందెమేళాలు
Language

(॥పల్లవి॥)
మానవుగా మాతోడ మందెమేళాలు
పానిపట్టి నీకు నాకు బాఁతచుట్టరికమా

(॥॥)
కొప్పువట్టే వది యేమి గుట్టున నన్ను నీ
కుప్పెసవర మున్నదా కొయ్యకాఁడవు
అప్పటిఁ జన్నులు ముట్టే వదేమి నీవు
తప్పక నీసరులేమి దాఁచఁగ బెట్టితివా

(॥॥)
కొంగువట్టే వదియేమీ కొసరుచును
ముంగిట నీ పైఁడేమైనా ముడిచితివా
సంగడిఁ జేయి వట్టేవు సారెకు నన్ను నీ
వుంగరాలు తడఁబడి వున్న వా నావేలను

(॥॥)
వోడక వురమెక్కించే వొద్దికై నీవు
జోడుగా నీకయినట్టి సొమ్మునా నేను
కూడితి కందనవోలి గోపాలకృష్ణ
యీడనే శ్రీవేంకటాద్రి యిరవాయనా

(||pallavi||)
mānavugā mādoḍa maṁdĕmeḽālu
pānibaṭṭi nīgu nāgu bām̐tasuṭṭarigamā

(||||)
kŏppuvaṭṭe vadi yemi guṭṭuna nannu nī
kuppĕsavara munnadā kŏyyagām̐ḍavu
appaḍim̐ jannulu muṭṭe vademi nīvu
tappaga nīsarulemi dām̐sam̐ga bĕṭṭidivā

(||||)
kŏṁguvaṭṭe vadiyemī kŏsarusunu
muṁgiḍa nī paim̐ḍemainā muḍisidivā
saṁgaḍim̐ jeyi vaṭṭevu sārĕgu nannu nī
vuṁgarālu taḍam̐baḍi vunna vā nāvelanu

(||||)
voḍaga vuramĕkkiṁche vŏddigai nīvu
joḍugā nīgayinaṭṭi sŏmmunā nenu
kūḍidi kaṁdanavoli gobālakṛṣhṇa
yīḍane śhrīveṁkaḍādri yiravāyanā