మానవు నీ వోజ లింకా మా కేల యింత
(॥పల్లవి॥)
మానవు నీ వోజ లింకా మా కేల యింత
కానీలే మగవాఁడవు కాకు సేసేవా
(॥వనవు॥)
వాసికి నీమీఁద నేను వలపు చల్లితిఁ గాక
యీసుల యెగసక్యాన కింత నవ్వేనా
చేసిన నీచేఁతలు సిర సూఁచుకొంటిఁ గాక
పాసినతమకానకుఁ బగ చాటేనా
(॥వనవు॥)
యిచ్చగించి నీపైఁ జేయి యిట్టె నే వేసితిఁ గాక
చొచ్చి నీమేనిగురుతు చొప్పు లెత్తేనా
మెచ్చి నీ వీపనులకు మేఁటి వని యుంటిఁ గాక
విచ్చనివిడిగా నిన్ను వెంగె మాడేనా
(॥వనవు॥)
కందువకు నీవు రాఁగాఁ గాఁగిట నించితిఁ గాక
అంది నిన్ను బలిమి సేయఁగ వచ్చేవా
అందపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
విందువలెఁ గూడితివి వేసరించేనా
(||pallavi||)
mānavu nī voja liṁkā mā kela yiṁta
kānīle magavām̐ḍavu kāgu sesevā
(||vanavu||)
vāsigi nīmīm̐da nenu valabu sallidim̐ gāga
yīsula yĕgasakyāna kiṁta navvenā
sesina nīsem̐talu sira sūm̐sugŏṁṭim̐ gāga
pāsinadamagānagum̐ baga sāḍenā
(||vanavu||)
yichchagiṁchi nībaim̐ jeyi yiṭṭĕ ne vesidim̐ gāga
sŏchchi nīmenigurudu sŏppu lĕttenā
mĕchchi nī vībanulagu mem̐ṭi vani yuṁṭim̐ gāga
vichchaniviḍigā ninnu vĕṁgĕ māḍenā
(||vanavu||)
kaṁduvagu nīvu rām̐gām̐ gām̐giḍa niṁchidim̐ gāga
aṁdi ninnu balimi seyam̐ga vachchevā
aṁdabu śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
viṁduvalĕm̐ gūḍidivi vesariṁchenā