(॥పల్లవి॥)
మానవు జగడము మాతోను
నే నీ కింతేసి నేరుపనా
(॥మానవు॥)
రపమున న న్నిటు రమ్మని పిలువఁగ
అపుడే నే నోప నననా
ఉపమల దూరేవు వూరకే నను నిటు
కపటం బిపుడే కైకొంటినా
(॥మానవు॥)
చెనకుచు నాపైయి చేతులు చాఁచఁగ
కొనచూపుల నినుఁ గోపించగా
తనియక నీవే తగిలేవు గాక
యెనసి యాస నీ కిచ్చితివా
(॥మానవు॥)
కలయుచు నీవే కాఁగిట నించఁగ
వలపు నీవు మఱవకు మనవా
బలిమి శ్రీవెంకటపతి ననుఁ గూడితి
వలసి యెదురుమా టాడితినా
(||pallavi||)
mānavu jagaḍamu mādonu
ne nī kiṁtesi nerubanā
(||mānavu||)
rabamuna na nniḍu rammani piluvam̐ga
abuḍe ne noba nananā
ubamala dūrevu vūrage nanu niḍu
kabaḍaṁ bibuḍe kaigŏṁṭinā
(||mānavu||)
sĕnagusu nābaiyi sedulu sām̐sam̐ga
kŏnasūbula ninum̐ gobiṁchagā
taniyaga nīve tagilevu gāga
yĕnasi yāsa nī kichchidivā
(||mānavu||)
kalayusu nīve kām̐giḍa niṁcham̐ga
valabu nīvu maṟavagu manavā
balimi śhrīvĕṁkaḍabadi nanum̐ gūḍidi
valasi yĕdurumā ṭāḍidinā