మానవే యెక్కడిసుద్ది మంకుదనాలు
(॥పల్లవి॥)
మానవే యెక్కడిసుద్ది మంకుదనాలు
తానే యాతఁడు నిన్నుఁ దగులగాను
(॥మాన॥)
చలపాదితనమేల సారెకుఁ బిలువఁగాను
పలుకరాదా నీపతితోను
తలపోఁత లింత యాల తమకించియాతడు
వెలయ నీపైఁ జేయివేయఁగాను
(॥మాన॥)
పంతములింతేఁశేలే బలిమిఁ బెనఁగఁగాను
మంతనములాడరాదా మగనితోను
రంతుతోడ వాదులేలే రతినాతఁ డలముక
వింతలుగా నిన్ను నిట్టె వేఁడుకోఁగాను
(॥మాన॥)
నివ్వెరగు లిఁకనేలే నిన్నుఁ బెండ్లాడఁగాను
నవ్వరాదా శ్రీవేంకటనాథునితోను
రవ్వగా నమ్మికలిచ్చి రమణుఁడు వేడుకతో
నివ్వటిల్లఁ బొగడుతా నిన్ను మెచ్చఁగాను
(||pallavi||)
mānave yĕkkaḍisuddi maṁkudanālu
tāne yādam̐ḍu ninnum̐ dagulagānu
(||māna||)
salabādidanamela sārĕgum̐ biluvam̐gānu
palugarādā nībadidonu
talabom̐ta liṁta yāla tamagiṁchiyādaḍu
vĕlaya nībaim̐ jeyiveyam̐gānu
(||māna||)
paṁtamuliṁtem̐śhele balimim̐ bĕnam̐gam̐gānu
maṁtanamulāḍarādā maganidonu
raṁtudoḍa vādulele radinādam̐ ḍalamuga
viṁtalugā ninnu niṭṭĕ vem̐ḍugom̐gānu
(||māna||)
nivvĕragu lim̐kanele ninnum̐ bĕṁḍlāḍam̐gānu
navvarādā śhrīveṁkaḍanāthunidonu
ravvagā nammigalichchi ramaṇum̐ḍu veḍugado
nivvaḍillam̐ bŏgaḍudā ninnu mĕchcham̐gānu