(॥పల్లవి॥)
మానవే మానవే నీమంకుఁదనము
మానరాని విభునితో మరి చలమేఁటికే
(॥వన॥)
సెలవుల లేఁతనవ్వు చిందఁగానే మాటలాడే -
చెలువునితో నలుక చెల్లునటవే
తెలివివెన్నెలలోని తేటలుగా నిన్నుఁ జూచి
వలచినపతితోడ వట్టిమోనమేఁటికే
(॥వన॥)
కన్నుల మొక్కులతోడఁ గట్టెదుర నిలుచుండే -
పన్నినజాణనితోడఁ బంతి మేఁటికే
సన్నలనే వినయము చల్లేటిరమణునితో
కిన్నెరమీఁటులలో నీకేరడములేఁటికే
(॥వన॥)
చేరి కాఁగిలించుకొనే శ్రీవేంకటేశుతోడ
ఆరయ లేఁతసిగ్గు లంతయేఁటికే
గారవాన నిన్నుఁగూడి ఘనుఁడైనయతనితో
బీరమాడి పచ్చినేసీ పెనఁగఁగనేఁటికే
(||pallavi||)
mānave mānave nīmaṁkum̐danamu
mānarāni vibhunido mari salamem̐ṭige
(||vana||)
sĕlavula lem̐tanavvu siṁdam̐gāne māḍalāḍe -
sĕluvunido naluga sĕllunaḍave
tĕlivivĕnnĕlaloni teḍalugā ninnum̐ jūsi
valasinabadidoḍa vaṭṭimonamem̐ṭige
(||vana||)
kannula mŏkkuladoḍam̐ gaṭṭĕdura nilusuṁḍe -
panninajāṇanidoḍam̐ baṁti mem̐ṭige
sannalane vinayamu salleḍiramaṇunido
kinnĕramīm̐ṭulalo nīgeraḍamulem̐ṭige
(||vana||)
seri kām̐giliṁchugŏne śhrīveṁkaḍeśhudoḍa
āraya lem̐tasiggu laṁtayem̐ṭige
gāravāna ninnum̐gūḍi ghanum̐ḍainayadanido
bīramāḍi pachchinesī pĕnam̐gam̐ganem̐ṭige