మానవయ్యా యింతేసి మంకుఁదనము
(॥పల్లవి॥)
మానవయ్యా యింతేసి మంకుఁదనము
కోనల చూపులలోని కొసరేఁటికిఁకను
(॥మాన॥)
కన్నులనే మెచ్చి మోవిఁగప్పురము లియ్యఁగాను
కన్నెనేల తిట్టేవు కాతరించి
వున్నతి వెంగెమాడెనా వూడిగము సేసెఁగాక
పన్ని నీకు నేఁడింత భయమేఁటికిఁకను
(॥మాన॥)
సెలవుల నవ్వు నవ్వి చెక్కులిట్టె నొక్కగాను
చెలినేల జంకించేవు చిత్తగించి
వెలయ రట్టుసేసెనా వేడుకలు చూపెఁగాక
కొలఁది మీరగ నీకు కోపమేఁటికిఁకను
(॥మాన॥)
కందువలు చూపి నిన్నుఁ గాఁగిలించుకొనఁగాను
ఇందుముఖినేల మించే విచ్చగించి
సందడి నీపైఁ జేసెనా చనవుమెరఁసెగాక
అంది శ్రీవేంకటేశుఁడ అలుపేల ఇఁకను
(||pallavi||)
mānavayyā yiṁtesi maṁkum̐danamu
konala sūbulaloni kŏsarem̐ṭigim̐kanu
(||māna||)
kannulane mĕchchi movim̐gappuramu liyyam̐gānu
kannĕnela tiṭṭevu kādariṁchi
vunnadi vĕṁgĕmāḍĕnā vūḍigamu sesĕm̐gāga
panni nīgu nem̐ḍiṁta bhayamem̐ṭigim̐kanu
(||māna||)
sĕlavula navvu navvi sĕkkuliṭṭĕ nŏkkagānu
sĕlinela jaṁkiṁchevu sittagiṁchi
vĕlaya raṭṭusesĕnā veḍugalu sūbĕm̐gāga
kŏlam̐di mīraga nīgu kobamem̐ṭigim̐kanu
(||māna||)
kaṁduvalu sūbi ninnum̐ gām̐giliṁchugŏnam̐gānu
iṁdumukhinela miṁche vichchagiṁchi
saṁdaḍi nībaim̐ jesĕnā sanavumĕram̐sĕgāga
aṁdi śhrīveṁkaḍeśhum̐ḍa alubela im̐kanu