మానవయ్య ఇటువంటి మతకము లాకెమీఁద
(॥పల్లవి॥)
మానవయ్య ఇటువంటి మతకము లాకెమీఁద
సానఁబట్టి చూపు నీవేజాడఁ బెనఁగితివో
(॥॥)
యీయెడఁ దెరవేసుక యింటిలో నున్నది చెలి
సేయరాని సేఁతలేమి సేసితివో
చాయల సన్నల నీపై చలపట్టుకున్నది
పాయపుమదాన నెంత పంతాలు చూపితివో
(॥॥)
వీడెము చేతఁబట్టుక వేసుకోక వున్నదిట్టే
అడరాని మాఁటలేమి యాడితివో
నీడనుండి యలయుచు నివ్వెరఁగుతో నున్నది
జోడుగూడేనంటా నెంత చొక్కులఁ బెట్టితివో
(॥॥)
చివ్వనఁ దలవంచుక సిగ్గుతోడ నున్నది
నవ్వరాని నవ్వులేమి నవ్వితివో
రవ్వగా శ్రీవేంకటేశ రమణి మొక్కుచున్నది
కువ్వలుగా రతినెట్టు గూడితివో
(||pallavi||)
mānavayya iḍuvaṁṭi madagamu lāgĕmīm̐da
sānam̐baṭṭi sūbu nīvejāḍam̐ bĕnam̐gidivo
(||||)
yīyĕḍam̐ dĕravesuga yiṁṭilo nunnadi sĕli
seyarāni sem̐talemi sesidivo
sāyala sannala nībai salabaṭṭugunnadi
pāyabumadāna nĕṁta paṁtālu sūbidivo
(||||)
vīḍĕmu sedam̐baṭṭuga vesugoga vunnadiṭṭe
aḍarāni mām̐ṭalemi yāḍidivo
nīḍanuṁḍi yalayusu nivvĕram̐gudo nunnadi
joḍugūḍenaṁṭā nĕṁta sŏkkulam̐ bĕṭṭidivo
(||||)
sivvanam̐ dalavaṁchuga siggudoḍa nunnadi
navvarāni navvulemi navvidivo
ravvagā śhrīveṁkaḍeśha ramaṇi mŏkkusunnadi
kuvvalugā radinĕṭṭu gūḍidivo