మానరమ్మ చెలులాల మరి పను లింకనేల
(॥పల్లవి॥)
మానరమ్మ చెలులాల మరి పను లింకనేల
కానీలేరే వొడఁబాట్లక్కడనయ్యీఁ గాని
(॥వన॥)
మనసెనయనిచోట మాటాడిన మాట గాదు
చెనకిన కడుఁగడు చేఁదుగాని
ననుపులేనిచోట నవ్వినా నవ్వు గాదు
వొనరఁగఁ బైఁజల్లేవుడుకులేకాని
(॥వన॥)
కూరిమిలేనిచోట కూడినాఁ గూటమి గాదు
ఆరీతి నుండెడిరిఆఁకలుగాని
మోరతోపులైనచోట మొక్కినా మొక్కు గాదు
వేరోక్కజాడలైనవెంగెముగాని
(॥వన॥)
యింపులమేనచోటి కేమన్నా నెగ్గు గాదు
జంపులమోహములోనిసటలు గాని
తెంపున శ్రీవేంకటాద్రిదేవుఁడిట్టె నన్నుఁ గూడె
ముంపులపోరామి గాదు మోహమేకాని
(||pallavi||)
mānaramma sĕlulāla mari panu liṁkanela
kānīlere vŏḍam̐bāṭlakkaḍanayyīm̐ gāni
(||vana||)
manasĕnayanisoḍa māḍāḍina māḍa gādu
sĕnagina kaḍum̐gaḍu sem̐dugāni
nanubulenisoḍa navvinā navvu gādu
vŏnaram̐gam̐ baim̐jallevuḍugulegāni
(||vana||)
kūrimilenisoḍa kūḍinām̐ gūḍami gādu
ārīdi nuṁḍĕḍiriām̐kalugāni
moradobulainasoḍa mŏkkinā mŏkku gādu
verokkajāḍalainavĕṁgĕmugāni
(||vana||)
yiṁpulamenasoḍi kemannā nĕggu gādu
jaṁpulamohamulonisaḍalu gāni
tĕṁpuna śhrīveṁkaḍādridevum̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ
muṁpulaborāmi gādu mohamegāni