మానరాని చుట్టమవు మధుసూదనా నీ
(॥పల్లవి॥)
మానరాని చుట్టమవు మధుసూదనా నీ
మానినిఁ జుమ్మీ నేను మధుసూదనా
(॥మాన॥)
మఱువకుమీ మా పొందు మధుసూదనా యింకా
మఱుఁగులేని మనకు మధుసూదనా
మఱి యేమి చెప్పేవు మధుసూదనా యే
మఱక మ మ్మేలుమీ మధుసూదనా
(॥మాన॥)
మడచి యా కిచ్చె నింద మధుసూదనా మేన
మడుగులాయె చెమట మధుసూదనా
మడిదొసకులు గావు మధుసూదనా నాకు
మడుక పన్నాయె మేలు మధుసూదనా
(॥మాన॥)
మందెమేళ మాయె రతి మధుసూదనా గొల్ల
మంద లెల్ల నీ సుద్దులే మధుసూదనా
మందు చల్లి కూడితివి మధుసూదనా మా
మందిరము శ్రీవేంకటమధుసూదనా
(||pallavi||)
mānarāni suṭṭamavu madhusūdanā nī
māninim̐ jummī nenu madhusūdanā
(||māna||)
maṟuvagumī mā pŏṁdu madhusūdanā yiṁkā
maṟum̐guleni managu madhusūdanā
maṟi yemi sĕppevu madhusūdanā ye
maṟaga ma mmelumī madhusūdanā
(||māna||)
maḍasi yā kichchĕ niṁda madhusūdanā mena
maḍugulāyĕ sĕmaḍa madhusūdanā
maḍidŏsagulu gāvu madhusūdanā nāgu
maḍuga pannāyĕ melu madhusūdanā
(||māna||)
maṁdĕmeḽa māyĕ radi madhusūdanā gŏlla
maṁda lĕlla nī suddule madhusūdanā
maṁdu salli kūḍidivi madhusūdanā mā
maṁdiramu śhrīveṁkaḍamadhusūdanā