(॥పల్లవి॥)
మానరాని మాయలు
కానీ యందు కేమి కలసీఁ గాని
(॥మాన॥)
చాలురా నీ సన్నలు నా
కాలు దాఁకీఁ గదియకు
కాలమందె యిన్నిఁ గంటిమి నా
చేల విడువరా చెప్పీఁ గాని
(॥మాన॥)
వద్దురా చల్లువలపూ యింత
ముద్దు లేల పల్లు మోఁచీని
అద్దొ కాలు దొక్కే వప్పటి వొక
కొద్ది నుండరా కూడీఁ గాని
(॥మాన॥)
చెల్లురా నీచేఁతలు నా
వొళ్లి చెమ టంటీ నొరయకు
తొల్లి కడపలో దొరసితి నా
వుల్లపు శ్రీవేంకటోత్తముఁడా
(||pallavi||)
mānarāni māyalu
kānī yaṁdu kemi kalasīm̐ gāni
(||māna||)
sālurā nī sannalu nā
kālu dām̐kīm̐ gadiyagu
kālamaṁdĕ yinnim̐ gaṁṭimi nā
sela viḍuvarā sĕppīm̐ gāni
(||māna||)
vaddurā salluvalabū yiṁta
muddu lela pallu mom̐sīni
addŏ kālu dŏkke vappaḍi vŏga
kŏddi nuṁḍarā kūḍīm̐ gāni
(||māna||)
sĕllurā nīsem̐talu nā
vŏḽli sĕma ṭaṁṭī nŏrayagu
tŏlli kaḍabalo dŏrasidi nā
vullabu śhrīveṁkaḍottamum̐ḍā