Maanaraadu nem dappulu maṟi yenni sesinaanu

మానరాదు నేఁ దప్పులు మఱి యెన్ని చేసినాను
Language

(॥పల్లవి॥)
మానరాదు నేఁ దప్పులు మఱి యెన్ని చేసినాను
కానిమ్మని నీకు నిట్టే కరుణించవలెను

(॥వన॥)
వేడుకైన నీ దేవుల విన్నపము విని కాని
యీడులేని నీ బిరుదు లెంచి కాని
పాడికొని నామముల ప్రభావాన నైనఁగాని
యేడనై నా నీ దాసుఁడ నెంచి కావవలెను

(॥వన॥)
నమ్మి నిన్నుఁ గొల్చిన నా గురునిఁ జూచి కాని
కమ్మకొని నాదైన్యము కనైనఁ గాని
వుమ్మడి నీకుఁ గలుగు నుదారత్వమునఁ గాని
పమ్మి నన్ను రక్షించి బ్రదికించవలెను

(॥వన॥)
హరి నాలోపల నున్న సమ్మంధమునఁ గాని
నిరతి నేలికలైన నెపానఁ గాని
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ
హరి నాకుఁ బ్రత్యక్షమై ఆదరించవలెను

(||pallavi||)
mānarādu nem̐ dappulu maṟi yĕnni sesinānu
kānimmani nīgu niṭṭe karuṇiṁchavalĕnu

(||vana||)
veḍugaina nī devula vinnabamu vini kāni
yīḍuleni nī birudu lĕṁchi kāni
pāḍigŏni nāmamula prabhāvāna nainam̐gāni
yeḍanai nā nī dāsum̐ḍa nĕṁchi kāvavalĕnu

(||vana||)
nammi ninnum̐ gŏlsina nā gurunim̐ jūsi kāni
kammagŏni nādainyamu kanainam̐ gāni
vummaḍi nīgum̐ galugu nudāratvamunam̐ gāni
pammi nannu rakṣhiṁchi bradigiṁchavalĕnu

(||vana||)
hari nālobala nunna sammaṁdhamunam̐ gāni
niradi neligalaina nĕbānam̐ gāni
paraga nalamelmaṁgabadi śhrīveṁkaḍeśha
hari nāgum̐ bratyakṣhamai ādariṁchavalĕnu