Maanaraadu nee kimka mamum gaavavalenu

మానరాదు నీ కింక మముఁ గావవలెను
Language

(॥పల్లవి॥)
మానరాదు నీ కింక మముఁ గావవలెను
పానిపట్టి నీకు నీవే బిరుదులై వున్నవి

(॥మాన॥)
సరవి నిన్ను భక్తరక్షకుఁ డని నారదుఁడు
పరువడి లోకములఁ బాడి పాడి చాటినాఁడు
సరగ నీ యర్థములకు శాసనాలై వేదములు
మొరయుచు బ్రహ్మనాల్గు మొగముల నున్నవి

(॥మాన॥)
శరణాగతవజ్రపంజరుఁ డని వాల్మీకి
సురలకు రామకథ చూపి చెప్పె గుఱిగాను
పొరి నీ సుద్దు లివే పురాణపత్రికలై
పెరుగుచు వ్యాసుల పెట్టెలలో నున్నవి

(॥మాన॥)
తారకబ్రహ్మ మవని తగఁ గాశిలో శివుఁడు
యేరుపరచి ప్రాణుల కెప్పుడుఁ జెప్పుచున్నాఁడు
యీ రీతి శ్రీవేంకటేశ యిందులకు సాక్షులు నీ వరాలు
ఆరూఢి గరుడగంభ మండ నేఁ డున్నవి

(||pallavi||)
mānarādu nī kiṁka mamum̐ gāvavalĕnu
pānibaṭṭi nīgu nīve birudulai vunnavi

(||māna||)
saravi ninnu bhaktarakṣhagum̐ ḍani nāradum̐ḍu
paruvaḍi logamulam̐ bāḍi pāḍi sāḍinām̐ḍu
saraga nī yardhamulagu śhāsanālai vedamulu
mŏrayusu brahmanālgu mŏgamula nunnavi

(||māna||)
śharaṇāgadavajrabaṁjarum̐ ḍani vālmīgi
suralagu rāmagatha sūbi sĕppĕ guṟigānu
pŏri nī suddu live purāṇabatrigalai
pĕrugusu vyāsula pĕṭṭĕlalo nunnavi

(||māna||)
tāragabrahma mavani tagam̐ gāśhilo śhivum̐ḍu
yerubarasi prāṇula kĕppuḍum̐ jĕppusunnām̐ḍu
yī rīdi śhrīveṁkaḍeśha yiṁdulagu sākṣhulu nī varālu
ārūḍhi garuḍagaṁbha maṁḍa nem̐ ḍunnavi