(॥పల్లవి॥)
మానరాదా యిఁకనేల మతకములు
నాని నాని నవ్వులెల్లా నయములు వచ్చెను
(॥మాన॥)
నిన్ను నే గొసరఁగాను నీవు నాతోఁ బెనగేవు
యెన్నిక లింకేమున్నవి యేడ సుద్దులు
సన్నల మనమంకులు సరికి బేసికి నాయ
నున్ననిచెమట లివె నొసళ్లెల్లా నిండెను
(॥మాన॥)
పంతాలు నే నాడఁగాను పై పై నురము దట్టేవు
యెంతకెంత సేసే వు యేడ సుద్దులు
మంతనపుమాటలెల్లా మారులు మలయఁజొచ్చె
చెంతల పులకలెల్ల చెక్కులెల్లా నిండెను
(॥మాన॥)
కొంగు నేనే పట్టఁగాను కుచ్చి కాఁగిలించేవు
యెంగిలాయ మోవులెల్లా నేడ సుద్దులు
కంగక శ్రీవేంకటేశ కలసితి మిద్దరము
సంగడి మనమేనుల సంతోసాలు నిండెను
(||pallavi||)
mānarādā yim̐kanela madagamulu
nāni nāni navvulĕllā nayamulu vachchĕnu
(||māna||)
ninnu ne gŏsaram̐gānu nīvu nādom̐ bĕnagevu
yĕnniga liṁkemunnavi yeḍa suddulu
sannala manamaṁkulu sarigi besigi nāya
nunnanisĕmaḍa livĕ nŏsaḽlĕllā niṁḍĕnu
(||māna||)
paṁtālu ne nāḍam̐gānu pai pai nuramu daṭṭevu
yĕṁtagĕṁta sese vu yeḍa suddulu
maṁtanabumāḍalĕllā mārulu malayam̐jŏchchĕ
sĕṁtala pulagalĕlla sĕkkulĕllā niṁḍĕnu
(||māna||)
kŏṁgu nene paṭṭam̐gānu kuchchi kām̐giliṁchevu
yĕṁgilāya movulĕllā neḍa suddulu
kaṁgaga śhrīveṁkaḍeśha kalasidi middaramu
saṁgaḍi manamenula saṁtosālu niṁḍĕnu