Maanaraa navvu maanavaa vaddu maanavaa

మానరా నవ్వు మానవా వద్దు మానవా
Language

(॥పల్లవి॥)
మానరా నవ్వు మానవా వద్దు మానవా
మాతో మానరా యేల మానరా । నీవు ।
మానకుంటే నన్ను నిందరు వినఁగా
మాటలఁ దిద్దక మానరా*

(॥॥)
వారి వీరితోడ వావులు చెప్పెంపే వట్టిదోసమేల కట్టేవురా
తేరకొన నన్నుఁజూచి వట్టి యాసదేర నుస్సుర నేఁటికి రా
పోరి పోరి నీవే నిజమరి నంటా బొంకుచు నన్నేల ముట్టోవురా
కోరి వూరకున్నవారి కింతేసికొడిమె లేఁటికి వచ్చీరా

(॥॥)
చక్కనివారికి నీయెదుట నేఁడు సారె నిలువ రాదటరా
వొక్కమాఁటలోనే నీవింత గరఁగి వొళ్లు చెమరించనేఁటికిరా
చిక్కనిచన్నులు నాకుఁ గలిగితే చింతఁ బొరలఁగ నీకేరా
మొక్కలాన నీవుసేసే రోఁతలకు మొదలనే నాకు సిగ్గవురా

(॥॥)
కారణములేక వూరివారితోడ కాలుదొక్క నేలవచ్చేవురా
నీరువంక తుంగవంటీవాఁడ వింతే నీతోడిపొందుకు నేనోపరా
కూరిమితోడుత శ్రీవేంకటేశ్వర కూడితివి నిన్ను నేమందురా
కోరినకోరికలెల్లాఁ దలకూడె గోరనన్ను నూఁదనేఁటికిరా

(||pallavi||)
mānarā navvu mānavā vaddu mānavā
mādo mānarā yela mānarā | nīvu |
mānaguṁṭe nannu niṁdaru vinam̐gā
māḍalam̐ diddaga mānarā*

(||||)
vāri vīridoḍa vāvulu sĕppĕṁpe vaṭṭidosamela kaṭṭevurā
teragŏna nannum̐jūsi vaṭṭi yāsadera nussura nem̐ṭigi rā
pori pori nīve nijamari naṁṭā bŏṁkusu nannela muṭṭovurā
kori vūragunnavāri kiṁtesigŏḍimĕ lem̐ṭigi vachchīrā

(||||)
sakkanivārigi nīyĕduḍa nem̐ḍu sārĕ niluva rādaḍarā
vŏkkamām̐ṭalone nīviṁta garam̐gi vŏḽlu sĕmariṁchanem̐ṭigirā
sikkanisannulu nāgum̐ galigide siṁtam̐ bŏralam̐ga nīgerā
mŏkkalāna nīvusese rom̐talagu mŏdalane nāgu siggavurā

(||||)
kāraṇamulega vūrivāridoḍa kāludŏkka nelavachchevurā
nīruvaṁka tuṁgavaṁṭīvām̐ḍa viṁte nīdoḍibŏṁdugu nenobarā
kūrimidoḍuda śhrīveṁkaḍeśhvara kūḍidivi ninnu nemaṁdurā
korinagorigalĕllām̐ dalagūḍĕ goranannu nūm̐danem̐ṭigirā