Maanani pumdlu maanina

మానని పుండ్లు మానిన
Language

(॥పల్లవి॥)
మానని పుండ్లు మానిన
అనుమానము తన కేమీ

(॥వనని॥)
పడరానిపాట్ల నెల్లఁ బరచి పోయిన తవులు
విడిచి యెవ్వరిఁ బట్టి వెంచినఁ దన కేమి
కడఁగి తన్నుఁ బట్టి గాసి సేసిన భూత
మెడప కెవ్వరిఁ బట్టి యేఁచినఁ దన కేమి

(॥వనని॥)
కాడువద్ద తన కాలి సంకెల కీలు
వూడి యెవ్వరికాల నుండినఁ దన కేమి
పాడు వరచి తన్నుఁబట్టి కట్టిన పెద్ద
తాడు యెవ్వరిమెడఁ దగిలినఁ దన కేమి

(॥వనని॥)
తిరువేంకటాచలాధీశుని కృపచేత
దురిత కంటకములు దొలఁగినఁ దన కేమి
పరివోని దురితకూపములైన దుష్ట
పరవశములు దన్నుఁ బాసినఁ దనకేమి

(||pallavi||)
mānani puṁḍlu mānina
anumānamu tana kemī

(||vanani||)
paḍarānibāṭla nĕllam̐ barasi poyina tavulu
viḍisi yĕvvarim̐ baṭṭi vĕṁchinam̐ dana kemi
kaḍam̐gi tannum̐ baṭṭi gāsi sesina bhūda
mĕḍaba kĕvvarim̐ baṭṭi yem̐sinam̐ dana kemi

(||vanani||)
kāḍuvadda tana kāli saṁkĕla kīlu
vūḍi yĕvvarigāla nuṁḍinam̐ dana kemi
pāḍu varasi tannum̐baṭṭi kaṭṭina pĕdda
tāḍu yĕvvarimĕḍam̐ dagilinam̐ dana kemi

(||vanani||)
tiruveṁkaḍāsalādhīśhuni kṛpaseda
durida kaṁṭagamulu dŏlam̐ginam̐ dana kemi
parivoni duridagūbamulaina duṣhṭa
paravaśhamulu dannum̐ bāsinam̐ danagemi