Maanamgade imtada nee mamkuvidyalu

మానఁగదె ఇంతట నీ మంకువిద్యలు
Language

(॥పల్లవి॥)
మానఁగదె ఇంతట నీ మంకువిద్యలు
యీ నెపాన నాతఁడన్ని నియ్యకొనఁడా

(॥మానఁ॥)
నవ్వులకు నొకమాట నాయకుఁడాడి నందుకు
ఇవ్వల సతులతోడ నేమి చెప్పేవే
జవ్వని వేకతమున సాదించితే నాతఁడు
చివ్వన నీ చెప్పినట్టు సేయకుండీనా

(॥మానఁ॥)
చేరి నిన్ను రమణుఁడు చేయివట్టినందుకు
తేరకొన నీవేల తిట్టఁజూచేవే
యీరీతి పానుపుమిఁద నేమిసేసినా నతఁడు
గారవించి నీకు లోనుఁగాక వుండీనా

(॥మానఁ॥)
శ్రీవేంకటేశుఁడు నినుఁ చెనకి కూడినందుకు
చేవదేర నీవేల సిగ్గువడేవే
నీవేమి అతనికి నేరిపిన యాతఁడు
కావించి నిన్నంతలోనే కడుమెచ్చకుండీనా

(||pallavi||)
mānam̐gadĕ iṁtaḍa nī maṁkuvidyalu
yī nĕbāna nādam̐ḍanni niyyagŏnam̐ḍā

(||mānam̐||)
navvulagu nŏgamāḍa nāyagum̐ḍāḍi naṁdugu
ivvala saduladoḍa nemi sĕppeve
javvani vegadamuna sādiṁchide nādam̐ḍu
sivvana nī sĕppinaṭṭu seyaguṁḍīnā

(||mānam̐||)
seri ninnu ramaṇum̐ḍu seyivaṭṭinaṁdugu
teragŏna nīvela tiṭṭam̐jūseve
yīrīdi pānubumim̐da nemisesinā nadam̐ḍu
gāraviṁchi nīgu lonum̐gāga vuṁḍīnā

(||mānam̐||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninum̐ sĕnagi kūḍinaṁdugu
sevadera nīvela sigguvaḍeve
nīvemi adanigi neribina yādam̐ḍu
kāviṁchi ninnaṁtalone kaḍumĕchchaguṁḍīnā