మానలేను నీ పొందు మరి నిన్నుఁ బాయలేను
(॥పల్లవి॥)
మానలేను నీ పొందు మరి నిన్నుఁ బాయలేను
యే నెపము లెట్టుండునో యేమి సేతు నేను
(॥॥)
చక్కని నీ రూపమె సారెకు నేఁ జూఁ డగాను
తక్కక నీకు దిష్టి దాఁకె నందురో
మక్కువ మాటలాడఁగా మర్మా లెందు సోఁకునో
యెక్కడని తలపోతు నేమి సేతు నేను
(॥॥)
చనవుతో నెప్పుడు నీ సంగడినేఁ బడుండఁగ
చను మొనలు నిన్నెట్టు జంట నొత్తునో
పెనఁగఁగా రతులలో బిట్టు గా నీ వలతువొ
యెనగొని మతిఁజింత లేమి సేతు నేను
(॥॥)
చలపట్టి నీ తోను సరసము లాడఁగాను
కలయికలకు నెంత కరఁగుదువో
అలరి శ్రీ వేంకటేశ అంతలో నన్నేలితివి
యెలమి నివ్వెఱఁ గైతి నేమి సేతు నేనూ
(||pallavi||)
mānalenu nī pŏṁdu mari ninnum̐ bāyalenu
ye nĕbamu lĕṭṭuṁḍuno yemi sedu nenu
(||||)
sakkani nī rūbamĕ sārĕgu nem̐ jūm̐ ḍagānu
takkaga nīgu diṣhṭi dām̐kĕ naṁduro
makkuva māḍalāḍam̐gā marmā lĕṁdu som̐kuno
yĕkkaḍani talabodu nemi sedu nenu
(||||)
sanavudo nĕppuḍu nī saṁgaḍinem̐ baḍuṁḍam̐ga
sanu mŏnalu ninnĕṭṭu jaṁṭa nŏttuno
pĕnam̐gam̐gā radulalo biṭṭu gā nī valaduvŏ
yĕnagŏni madim̐jiṁta lemi sedu nenu
(||||)
salabaṭṭi nī tonu sarasamu lāḍam̐gānu
kalayigalagu nĕṁta karam̐guduvo
alari śhrī veṁkaḍeśha aṁtalo nannelidivi
yĕlami nivvĕṟam̐ gaidi nemi sedu nenū