మానలేనే పొందు మానలేనే నిన్ను మానలేనే । ఆ
(॥పల్లవి॥)
మానలేనే పొందు మానలేనే నిన్ను మానలేనే । ఆ-
ఆనెను మోహము నేఁ డంటవే నాదేహము
(॥మాన॥)
చక్కఁదనములతేట చల్లనివెన్నెలవూట
వొక్కమాటడవే నీ వొద్దిక మాట
చక్కెరవింటిలో తూపు జవ్వనములో నీరూపు
గక్కనఁ జూడవే కడకంటిచూపు
(॥మాన॥)
యింపుఁజిగురుఁజప్పర మిన్నిటిలో బిత్తరము
సొంపుగఁ జాఁచవే నీసోగకరము
సంపదల ముజ్జగము చందురునిసోయగము
జంపులేల యెత్తవే నీసవరనిమొగము
(॥మాన॥)
మదనుని తేరుజోక మంచిమెఱుఁగుల రేక
యెదురు చూడఁగ వచ్చే విట్టి నీరాక
ఇదె శ్రీ వేంకటగిరి నిరవై వావిలిపాటఁ
బొదలిన రాఘవుఁడఁ బొందితి నదె
(||pallavi||)
mānalene pŏṁdu mānalene ninnu mānalene | ā-
ānĕnu mohamu nem̐ ḍaṁṭave nādehamu
(||māna||)
sakkam̐danamuladeḍa sallanivĕnnĕlavūḍa
vŏkkamāḍaḍave nī vŏddiga māḍa
sakkĕraviṁṭilo tūbu javvanamulo nīrūbu
gakkanam̐ jūḍave kaḍagaṁṭisūbu
(||māna||)
yiṁpum̐jigurum̐jappara minniḍilo bittaramu
sŏṁpugam̐ jām̐save nīsogagaramu
saṁpadala mujjagamu saṁdurunisoyagamu
jaṁpulela yĕttave nīsavaranimŏgamu
(||māna||)
madanuni terujoga maṁchimĕṟum̐gula rega
yĕduru sūḍam̐ga vachche viṭṭi nīrāga
idĕ śhrī veṁkaḍagiri niravai vāvilibāḍam̐
bŏdalina rāghavum̐ḍam̐ bŏṁdidi nadĕ