Maanaga naado navvevu mamchide kaadaa

మానక నాతో నవ్వేవు మంచిదే కాదా
Language

(॥పల్లవి॥)
మానక నాతో నవ్వేవు మంచిదే కాదా
మేను ముట్టి నిమిరేవు మెచ్చే కాదా

(॥మాన॥)
వెంటవెంటఁ దిరిగాడే వెలదు లెల్లా నుండఁగ
నంటు నాతో మాటాడేవు నయమే కాదా
అంటి ముట్టి సరసములాడేవార లుండఁగాను
యింటికి విచ్చేసితివి యిది మేలు గాదా

(॥మాన॥)
పంత మాడి పొందుసేసే పడఁతు లెల్లా నుండఁగ
యింత నాదిక్కే చూచేవు యెక్కుడే కాదా
చెంతల మొక్కేటివారు శేనాశేనా లుండాఁగాను
దొంతిగాఁబై నొరగేవు దొడ్డతనము గాదా

(॥మాన॥)
ఇచ్చకములాడేవారు యెదుటనే వుండఁగాను
వచ్చి కాఁగిలించేవు నావన్నే కాదా
చెచ్చెర నిందరిలోన శ్రీ వేంకటేశుఁడ నన్నుఁ
గుచ్చి కూడితివి యిదే గురుతు కాదా

(||pallavi||)
mānaga nādo navvevu maṁchide kādā
menu muṭṭi nimirevu mĕchche kādā

(||māna||)
vĕṁṭavĕṁṭam̐ dirigāḍe vĕladu lĕllā nuṁḍam̐ga
naṁṭu nādo māḍāḍevu nayame kādā
aṁṭi muṭṭi sarasamulāḍevāra luṁḍam̐gānu
yiṁṭigi vichchesidivi yidi melu gādā

(||māna||)
paṁta māḍi pŏṁdusese paḍam̐tu lĕllā nuṁḍam̐ga
yiṁta nādikke sūsevu yĕkkuḍe kādā
sĕṁtala mŏkkeḍivāru śhenāśhenā luṁḍām̐gānu
dŏṁtigām̐bai nŏragevu dŏḍḍadanamu gādā

(||māna||)
ichchagamulāḍevāru yĕduḍane vuṁḍam̐gānu
vachchi kām̐giliṁchevu nāvanne kādā
sĕchchĕra niṁdarilona śhrī veṁkaḍeśhum̐ḍa nannum̐
guchchi kūḍidivi yide gurudu kādā