Maanaabadulado nimta mamkulum jalamulela

మానాపతులతో నింత మంకులుఁ జలములేల
Language

(॥పల్లవి॥)
మానాపతులతో నింత మంకులుఁ జలములేల
వూనిన నీవే బుజ్జగించి బుద్ది నేర్పరాదా

(॥వనా॥)
సిగ్గులు చేటఁడేసి చిరునవ్వు మూటెఁడేసి
యెగ్గులుఁ దప్పులునైతే యేరాళము
వొగ్గి యాపెఁ గొలువులో నొడివట్టేల తీసెవు
తగ్గక నీవే యేకతానకు రారాదా

(॥వనా॥)
కోరికలు బారెఁడేసి గుంపెనలు మూరెఁడేసి
బీసరసములైతే మితిమీర లేదు
కూరాకుగా నీ వాపెకొప్పేల పట్టి తీసేవు
దారదప్పకిట్టే యేకతానకు రారాదా

(॥వనా॥)
సరసాలు గంపెఁడేసి సలిగెలు గుంపెఁడేసి
సిరుల రాజసములు శేనా శేన
అరిది శ్రీవేంకటేశ అలయించీకెఁ గూడితిఁ
విరవై యేకతమున కిప్పుడే రారాదా

(||pallavi||)
mānābadulado niṁta maṁkulum̐ jalamulela
vūnina nīve bujjagiṁchi buddi nerbarādā

(||vanā||)
siggulu seḍam̐ḍesi sirunavvu mūḍĕm̐ḍesi
yĕggulum̐ dappulunaide yerāḽamu
vŏggi yābĕm̐ gŏluvulo nŏḍivaṭṭela tīsĕvu
taggaga nīve yegadānagu rārādā

(||vanā||)
korigalu bārĕm̐ḍesi guṁpĕnalu mūrĕm̐ḍesi
bīsarasamulaide midimīra ledu
kūrāgugā nī vābĕgŏppela paṭṭi tīsevu
dāradappagiṭṭe yegadānagu rārādā

(||vanā||)
sarasālu gaṁpĕm̐ḍesi saligĕlu guṁpĕm̐ḍesi
sirula rājasamulu śhenā śhena
aridi śhrīveṁkaḍeśha alayiṁchīgĕm̐ gūḍidim̐
viravai yegadamuna kippuḍe rārādā