Maana veppudunu nee maaya lellaanu

మాన వెప్పుడును నీ మాయ లెల్లాను
Language

(॥పల్లవి॥)
మాన వెప్పుడును నీ మాయ లెల్లాను
నానిన నా ననుపులు నవ్వించీఁ గాని

(॥మాన॥)
వాలుకరెప్పలు నీపై వంచి నే నెంత లోఁచినా
తాలిమె చూపుదు గాక తత్తరించేనా
వాలాయించి రాతిగుండెవాఁడ వౌత యెఱుఁగుదు
పాలుమాలిన నా యాస పాయ నీదు గాని

(॥మాన॥)
ఆయములు సోఁక మాటలాడి యంత కొసరిన
చాయకాఁడవె కాక సమ్మతించేవా
కాయకపు నీసరిత గట్టిగా నే నెరుఁగదు
పాయపు నా వేడుకలు పై కొలిపీఁ గాని

(॥మాన॥)
చిమ్నుచు నీ కాఁగిటిలో చేత లెంత నేసినాను
కుమ్మరించి నాతోను నీ గుట్టు చెప్పేవా
కమ్మటి శ్రీవెంకటాద్రి కడపరాయఁడవై
నెమ్మది గూడితి విదె నిజమాయఁ గాని

(||pallavi||)
māna vĕppuḍunu nī māya lĕllānu
nānina nā nanubulu navviṁchīm̐ gāni

(||māna||)
vālugarĕppalu nībai vaṁchi ne nĕṁta lom̐sinā
tālimĕ sūbudu gāga tattariṁchenā
vālāyiṁchi rādiguṁḍĕvām̐ḍa vauda yĕṟum̐gudu
pālumālina nā yāsa pāya nīdu gāni

(||māna||)
āyamulu som̐ka māḍalāḍi yaṁta kŏsarina
sāyagām̐ḍavĕ kāga sammadiṁchevā
kāyagabu nīsarida gaṭṭigā ne nĕrum̐gadu
pāyabu nā veḍugalu pai kŏlibīm̐ gāni

(||māna||)
simnusu nī kām̐giḍilo seda lĕṁta nesinānu
kummariṁchi nādonu nī guṭṭu sĕppevā
kammaḍi śhrīvĕṁkaḍādri kaḍabarāyam̐ḍavai
nĕmmadi gūḍidi vidĕ nijamāyam̐ gāni