Maamumdara nimta yaala madagaalu nerubevu

మాముందర నింత యాల మతకాలు నెరుపేవు
Language

(॥పల్లవి॥)
మాముందర నింత యాల మతకాలు నెరుపేవు
గామిడివి గావోయి కడపరాయా

(॥॥)
కందువ సేవలు సేసి కడునవ్వులు నవ్వీని
పొందు గద్దో తొల్లి నీకుఁ బొలఁతితోను
విందు చెప్పవచ్చీని విడెము చేతి కిచ్చీని
అందెనో వొడఁబాట్లు ఆపెకు నీకు

(॥॥)
ఆసల చూపులు చూచి అంటి ముట్టి పెనఁగీని
బాస సేసితివో తొల్లి పడఁతికిని
సేసలు పైఁజల్లీని చెంగట గొలువు సేసీ
ఆసుద్దు లొనగూడెనా ఆపెకు నీకు

(॥॥)
కాయము చన్నుల నొత్తీ కాఁకదేరి మాటలాడీ
ఆయనా చుట్టరికము అంగనతోను
యీయెడ శ్రీ వేంకటేశ ఇటు నన్ను నేలితివి
ఆయితమా పెండ్లికి ఆపెకు నీకు

(||pallavi||)
māmuṁdara niṁta yāla madagālu nĕrubevu
gāmiḍivi gāvoyi kaḍabarāyā

(||||)
kaṁduva sevalu sesi kaḍunavvulu navvīni
pŏṁdu gaddo tŏlli nīgum̐ bŏlam̐tidonu
viṁdu sĕppavachchīni viḍĕmu sedi kichchīni
aṁdĕno vŏḍam̐bāṭlu ābĕgu nīgu

(||||)
āsala sūbulu sūsi aṁṭi muṭṭi pĕnam̐gīni
bāsa sesidivo tŏlli paḍam̐tigini
sesalu paim̐jallīni sĕṁgaḍa gŏluvu sesī
āsuddu lŏnagūḍĕnā ābĕgu nīgu

(||||)
kāyamu sannula nŏttī kām̐kaderi māḍalāḍī
āyanā suṭṭarigamu aṁganadonu
yīyĕḍa śhrī veṁkaḍeśha iḍu nannu nelidivi
āyidamā pĕṁḍligi ābĕgu nīgu