Maamtogadi semtogadi madagamai yumdigaani

మాఁటొకటి చేఁతొకటి మతకమై యుందిగాని
Language

(॥పల్లవి॥)
మాఁటొకటి చేఁతొకటి మతకమై యుందిగాని
మూఁటవలపులే కాని మోహము దెలియరా

(॥మాఁటొ॥)
చిత్తములోపల నీకు చింత యెందున్నదోకాని
గుత్తవుఁగళలు దేరీ గురి నీమోము
యెత్తి(న) విరహాననుండే ఇటునాయలపు చూచి
రిత్త వగచేవుగాని కొత్త లివెక్కడోరా

(॥మాఁటొ॥)
కాయముమీఁదట నీకుఁ గాఁక యెట్టున్నదోకాని
చాయల చూపుల నీకు సంతసమే పో
పాయముతో నిన్నిఁబాసి పడియున్ననన్నుఁ జూచి
మాయల కెత్తితిగాని మచ్చికేమీఁ గానరా

(॥మాఁటొ॥)
కూడినకూటములోనఁ గోరి కెట్టున్నదో కాని
నీడ నీభావము నివ్వెరగులే
యీడనే శ్రీ వేంకటేశ యేకమైతి మిద్దరము
వీడనాడితి నిందాఁకా విరసాలు లేవురా

(||pallavi||)
mām̐ṭŏgaḍi sem̐tŏgaḍi madagamai yuṁdigāni
mūm̐ṭavalabule kāni mohamu dĕliyarā

(||mām̐ṭŏ||)
sittamulobala nīgu siṁta yĕṁdunnadogāni
guttavum̐gaḽalu derī guri nīmomu
yĕtti(na) virahānanuṁḍe iḍunāyalabu sūsi
ritta vagasevugāni kŏtta livĕkkaḍorā

(||mām̐ṭŏ||)
kāyamumīm̐daḍa nīgum̐ gām̐ka yĕṭṭunnadogāni
sāyala sūbula nīgu saṁtasame po
pāyamudo ninnim̐bāsi paḍiyunnanannum̐ jūsi
māyala kĕttidigāni machchigemīm̐ gānarā

(||mām̐ṭŏ||)
kūḍinagūḍamulonam̐ gori kĕṭṭunnado kāni
nīḍa nībhāvamu nivvĕragule
yīḍane śhrī veṁkaḍeśha yegamaidi middaramu
vīḍanāḍidi niṁdām̐kā virasālu levurā