Maamtalu neevaadinavi maravamayyaa

మాఁటలు నీవాడినవి మరవమయ్యా
Language

(॥పల్లవి॥)
మాఁటలు నీవాడినవి మరవమయ్యా
యేఁటికి వేగిరించక యిట్టె వుండవయ్యా

(॥మాఁట॥)
మొక్కితిమి నాఁడె నీకు మొగము నోడితిమి
గుక్కుచు నల్లాడ నట్టే కూచుండేమయ్యా
యెక్కడిసుద్దులు మమ్ము నేల కొంగు పట్టితివి
అక్కరతో నింకొక్కమా టప్పుటి వచ్చేమయ్యా

(॥మాఁట॥)
సేవ చేసితిమి నీకు చేరి పంత మిచ్చితిమి
తావుకుఁ బోయి నీమేలు తలఁచేమయ్యా
వేవేలు వచ్చెను మమ్ము వేడుఁకొనే వింత యేల
నీవద్ది కేపనికైనా నెలఁత నంపేమయ్యా

(॥మాఁట॥)
నీకొలువు సేసితిమి నిండాఁ దనిసితిమి
చేకొని నీవార మని చెప్పిమయ్యా
యీకడ శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుం గూడితివి
రాకపోకలకు నిన్ను రప్పించుకొనేమయ్యా

(||pallavi||)
mām̐ṭalu nīvāḍinavi maravamayyā
yem̐ṭigi vegiriṁchaga yiṭṭĕ vuṁḍavayyā

(||mām̐ṭa||)
mŏkkidimi nām̐ḍĕ nīgu mŏgamu noḍidimi
gukkusu nallāḍa naṭṭe kūsuṁḍemayyā
yĕkkaḍisuddulu mammu nela kŏṁgu paṭṭidivi
akkarado niṁkŏkkamā ṭappuḍi vachchemayyā

(||mām̐ṭa||)
seva sesidimi nīgu seri paṁta michchidimi
tāvugum̐ boyi nīmelu talam̐semayyā
vevelu vachchĕnu mammu veḍum̐kŏne viṁta yela
nīvaddi kebanigainā nĕlam̐ta naṁpemayyā

(||mām̐ṭa||)
nīgŏluvu sesidimi niṁḍām̐ danisidimi
segŏni nīvāra mani sĕppimayyā
yīgaḍa śhrī veṁkaḍeśha iṭṭĕ nannuṁ gūḍidivi
rāgabogalagu ninnu rappiṁchugŏnemayyā