Maamtalu needo maa kela

మాఁటలు నీతో మా కేల
Language

(॥పల్లవి॥)
మాఁటలు నీతో మా కేల
ఆఁటదాని కన రంటీఁ గాని

(॥మాటలు॥)
చెప్పక చెప్పిన చెలివిన్నపములు
ఱెప్పల తుదలనె ఱెట్టించే
వుప్పతించి ని న్నొకటీ నాడము
తప్పనిబాసలె తగిలీఁ గాని

(॥మాటలు॥)
అంపక యంపిన అంగన కానికె
ముంపుకుచములనె మొన చూపే
గుంపెనతో నిఁక కూరిమి గొసరము
పెంపువిరహమె పెనగోనీఁ గాని

(॥మాటలు॥)
కూడక కూడిన కోమలికోరికె
వాడుమోవిని వన్నాయి
యీడనె శ్రీవెంకటేశ యేలితవి
వేడుకవలపులె వెతకీఁ గాని

(||pallavi||)
mām̐ṭalu nīdo mā kela
ām̐ṭadāni kana raṁṭīm̐ gāni

(||māḍalu||)
sĕppaga sĕppina sĕlivinnabamulu
ṟĕppala tudalanĕ ṟĕṭṭiṁche
vuppadiṁchi ni nnŏgaḍī nāḍamu
tappanibāsalĕ tagilīm̐ gāni

(||māḍalu||)
aṁpaga yaṁpina aṁgana kānigĕ
muṁpugusamulanĕ mŏna sūbe
guṁpĕnado nim̐ka kūrimi gŏsaramu
pĕṁpuvirahamĕ pĕnagonīm̐ gāni

(||māḍalu||)
kūḍaga kūḍina komaligorigĕ
vāḍumovini vannāyi
yīḍanĕ śhrīvĕṁkaḍeśha yelidavi
veḍugavalabulĕ vĕdagīm̐ gāni