(॥పల్లవి॥)
మాఁటలనే చలివాప మనకేలే
వాఁటమయ్యీఁ జేఁతలెల్ల వద్దు మనకేలే
(॥మాట॥)
నిందఁబడ్డవాఁడుగాన నిన్నుఁజూచి మొక్కఁగాను
మందలించి రట్టుసేయ మనకేలే
ఇందునందు నుండెఁగాన యిచ్చకము సేయఁగాను
అందరిలో నణఁకించ నంత మనకేలే
(॥మాట॥)
నేరమి గలిగెఁగాన నీయింటికే రాఁగా వే -
మారు వెంగెములాడ మనకేలే
జీరలు మైనిండెఁగాన చెరఁగునఁ గప్పుకోఁగా
తోరముగా నవ్వు నవ్వి దూరమునకేలే
(॥మాట॥)
గక్కన సిగ్గువడ్డాఁడుగాన తలవంచితేను
మక్కువఁ బైకొనకుండ మనకేలే
వొక్కటై శ్రీవేంకటేశుఁ డొడఁబడ నిన్నుఁ గూడె
యెక్కడిసుద్దులు నిఁక నెంచ మనకేలే
(||pallavi||)
mām̐ṭalane salivāba managele
vām̐ṭamayyīm̐ jem̐talĕlla vaddu managele
(||māḍa||)
niṁdam̐baḍḍavām̐ḍugāna ninnum̐jūsi mŏkkam̐gānu
maṁdaliṁchi raṭṭuseya managele
iṁdunaṁdu nuṁḍĕm̐gāna yichchagamu seyam̐gānu
aṁdarilo naṇam̐kiṁcha naṁta managele
(||māḍa||)
nerami galigĕm̐gāna nīyiṁṭige rām̐gā ve -
māru vĕṁgĕmulāḍa managele
jīralu mainiṁḍĕm̐gāna sĕram̐gunam̐ gappugom̐gā
toramugā navvu navvi dūramunagele
(||māḍa||)
gakkana sigguvaḍḍām̐ḍugāna talavaṁchidenu
makkuvam̐ baigŏnaguṁḍa managele
vŏkkaḍai śhrīveṁkaḍeśhum̐ ḍŏḍam̐baḍa ninnum̐ gūḍĕ
yĕkkaḍisuddulu nim̐ka nĕṁcha managele