Maamtalaadavayya imka maguva neevuda nokkade

మాఁటలాడవయ్య ఇఁక మగువ నీవుత నొక్కటే
Language

(॥పల్లవి॥)
మాఁటలాడవయ్య ఇఁక మగువ నీవుత నొక్కటే
ఆఁటదాని కిదే చల్లవారెఁ గోపము

(॥మాట॥)
కాయముపైఁ జేయివేసి కప్పురము నోటికిచ్చి
ఆయము లంటఁగాఁ జల్లనారెఁ గోపము
చాయలు సన్నలుఁ జేసి చవులుగా మోవి ఇచ్చి
ఆయెడ మొక్కఁగాఁ జల్లనారెఁ గోపము

(॥మాట॥)
కొప్పు గడుదువ్వి యట్టె కొంగు చేతఁబట్టుకొని
అప్పసము నవ్వఁగాం జల్లారెఁ గోపము
రెప్పలెత్తి చూచి చూచి రేసులెల్లా నించఁగాను
అప్పుడట్టె మతిఁ జల్లనారెఁ గోపము

(॥మాట॥)
పచ్చిగాఁగం గాఁగిలించి పట్టి తమ్ములము వెట్టి
అచ్చు గోరు మోపఁగాఁ జల్లరెఁ గోపము
మచ్చిక శ్రీవేంకటేశ మనసారఁ గూడితివి
అచ్చలము దేరి చల్లనారెఁ గోపము

(||pallavi||)
mām̐ṭalāḍavayya im̐ka maguva nīvuda nŏkkaḍe
ām̐ṭadāni kide sallavārĕm̐ gobamu

(||māḍa||)
kāyamubaim̐ jeyivesi kappuramu noḍigichchi
āyamu laṁṭam̐gām̐ jallanārĕm̐ gobamu
sāyalu sannalum̐ jesi savulugā movi ichchi
āyĕḍa mŏkkam̐gām̐ jallanārĕm̐ gobamu

(||māḍa||)
kŏppu gaḍuduvvi yaṭṭĕ kŏṁgu sedam̐baṭṭugŏni
appasamu navvam̐gāṁ jallārĕm̐ gobamu
rĕppalĕtti sūsi sūsi resulĕllā niṁcham̐gānu
appuḍaṭṭĕ madim̐ jallanārĕm̐ gobamu

(||māḍa||)
pachchigām̐gaṁ gām̐giliṁchi paṭṭi tammulamu vĕṭṭi
achchu goru mobam̐gām̐ jallarĕm̐ gobamu
machchiga śhrīveṁkaḍeśha manasāram̐ gūḍidivi
achchalamu deri sallanārĕm̐ gobamu