మాఁజితేను జవ్వనము మట్టున నిలుచునా
(॥పల్లవి॥)
మాఁజితేను జవ్వనము మట్టున నిలుచునా
రాఁజిరాఁజి వలపు లాఱడిఁ బెట్టుఁగాక
(॥మాఁజి॥)
చెలి నీవు మోవితేనె సిగ్గువడి దాఁచితేను
వెలయఁ బలుకుఁదేనై వెళ్ళఁబారీని
సెలవులనవ్వులవి చిత్తములో నడఁచితే
కొలుకులఁ దెలిచూపై కుమ్మరించీ నదిగో
(॥మాఁజి॥)
పడఁతి నీ తమకము బయటనే మొరఁగితే
నిడుదనిట్టూర్పులై నిగ్గుదేరిని
బడి కుచముల వుబ్బు పయ్యదలోఁ గప్పితేను
వెడలుఁ బులకలై వెల్లివిరిసీని
(॥మాఁజి॥)
కామిని నీ కోరికలు కాఁగిటిలో దలఁచితే
నామనలోఁ దోఁచి నారుకోనీని
వేమరు శ్రీవెంకటాద్రివిభుఁడ నేఁగూడితిని
యీమేలెల్లా నీపై నినుమడించీని
(||pallavi||)
mām̐jidenu javvanamu maṭṭuna nilusunā
rām̐jirām̐ji valabu lāṟaḍim̐ bĕṭṭum̐gāga
(||mām̐ji||)
sĕli nīvu movidenĕ sigguvaḍi dām̐sidenu
vĕlayam̐ balugum̐denai vĕḽḽam̐bārīni
sĕlavulanavvulavi sittamulo naḍam̐side
kŏlugulam̐ dĕlisūbai kummariṁchī nadigo
(||mām̐ji||)
paḍam̐ti nī tamagamu bayaḍane mŏram̐gide
niḍudaniṭṭūrbulai nigguderini
baḍi kusamula vubbu payyadalom̐ gappidenu
vĕḍalum̐ bulagalai vĕllivirisīni
(||mām̐ji||)
kāmini nī korigalu kām̐giḍilo dalam̐side
nāmanalom̐ dom̐si nārugonīni
vemaru śhrīvĕṁkaḍādrivibhum̐ḍa nem̐gūḍidini
yīmelĕllā nībai ninumaḍiṁchīni