Maameemdi tappu lannee mannimchidivi

మామీఁది తప్పు లన్నీ మన్నించితివి
Language

(॥పల్లవి॥)
మామీఁది తప్పు లన్నీ మన్నించితివి
దోమటి నిన్నిటా నీవే దొడ్డవాఁడవయ్యా

(॥మామీఁ॥)
మచ్చరించి నీతోడ మాటాలాడినందుకెల్ల
చెచ్చెర నీకు మొక్కేము చేకొనవయ్యా
వచ్చి వచ్చి నీమీఁద వలపు చల్లినందుకు
యిచ్చేము పంతము మమ్ము నిఁకఁ గావవయ్యా

(॥మామీఁ॥)
మందెమేళమున నిన్ను మాటలాడినందుకెల్ల
అందరిలో నీతొత్తుల మయ్యేమయ్యా
చెంది నీపై రసాల చేతులు చాఁచినందుకు
అంది నీపాదాలు మాపై నట్టె చాఁపవయ్యా

(॥మామీఁ॥)
కక్కసించి నిన్ను నిట్టె కాఁగిటఁ గూడినందుకు
వొక్కటై నీతమ్మకుఁ జెయ్యొగ్గేమయ్యా
యిక్కు వెరిఁగి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
తక్కినపనులు మాని దయఁ జూడవయ్యా

(||pallavi||)
māmīm̐di tappu lannī manniṁchidivi
domaḍi ninniḍā nīve dŏḍḍavām̐ḍavayyā

(||māmīm̐||)
machchariṁchi nīdoḍa māḍālāḍinaṁdugĕlla
sĕchchĕra nīgu mŏkkemu segŏnavayyā
vachchi vachchi nīmīm̐da valabu sallinaṁdugu
yichchemu paṁtamu mammu nim̐kam̐ gāvavayyā

(||māmīm̐||)
maṁdĕmeḽamuna ninnu māḍalāḍinaṁdugĕlla
aṁdarilo nīdŏttula mayyemayyā
sĕṁdi nībai rasāla sedulu sām̐sinaṁdugu
aṁdi nībādālu mābai naṭṭĕ sām̐pavayyā

(||māmīm̐||)
kakkasiṁchi ninnu niṭṭĕ kām̐giḍam̐ gūḍinaṁdugu
vŏkkaḍai nīdammagum̐ jĕyyŏggemayyā
yikku vĕrim̐gi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
takkinabanulu māni dayam̐ jūḍavayyā