Maamaada saragu gaadu maguva neegu

మామాట సరకు గాదు మగువ నీకు
Language

(॥పల్లవి॥)
మామాట సరకు గాదు మగువ నీకు
కామించినాతఁడే నిన్నుఁ గరఁగించీ లేవే

(॥మామాట॥)
పొత్తుకుఁ బిలిచీ వాఁడే పోవే పతివద్దికి
అత్తల నీవు రాక ఆరగించఁడు
వొత్తి బుద్ది చెప్పితేను వొద్దివారిఁ గోపించేవు
బత్తి గలాతఁడె వచ్చి పట్టి తీసీ లేవే

(॥మామాట॥)
తనమీఁద నానవెట్టి దగ్గరి మాటాడనే
నిను నూరడించుదాఁకా నిలుచున్నాఁడే
యెనయించి చెలులతో నెక్కుడు పంత మాడేవు
చనవు గలాతఁడే నీ చలివాపీ లేవే

(॥మామాట॥)
కొంగు వట్టి తీసీని కూచుండవే వొద్ద
చెంగట నీవు రాకున్న చిన్నఁ బోయీని
ముంగిట మామోము చూచి ముసిముసి నవ్వు నవ్వే
నెంగిలిమోవి శ్రీవేంకటేశుఁ డిచ్చే లేవే

(||pallavi||)
māmāḍa saragu gādu maguva nīgu
kāmiṁchinādam̐ḍe ninnum̐ garam̐giṁchī leve

(||māmāḍa||)
pŏttugum̐ bilisī vām̐ḍe pove padivaddigi
attala nīvu rāga āragiṁcham̐ḍu
vŏtti buddi sĕppidenu vŏddivārim̐ gobiṁchevu
batti galādam̐ḍĕ vachchi paṭṭi tīsī leve

(||māmāḍa||)
tanamīm̐da nānavĕṭṭi daggari māḍāḍane
ninu nūraḍiṁchudām̐kā nilusunnām̐ḍe
yĕnayiṁchi sĕlulado nĕkkuḍu paṁta māḍevu
sanavu galādam̐ḍe nī salivābī leve

(||māmāḍa||)
kŏṁgu vaṭṭi tīsīni kūsuṁḍave vŏdda
sĕṁgaḍa nīvu rāgunna sinnam̐ boyīni
muṁgiḍa māmomu sūsi musimusi navvu navve
nĕṁgilimovi śhrīveṁkaḍeśhum̐ ḍichche leve